• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నా పేరు గౌతమ్ గంభీర్.. మాటలు చెప్పను.. ఢిల్లీ కాలుష్యానికి పరిష్కారమిదిగో..

|

ఎయిర్ పొల్యూషన్.. కొన్నేళ్లుగా దేశ రాజధాని ఢిల్లీని అతలాకుతలం చేస్తోన్న సమస్య. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు వందలాది స్వచ్ఛంద సంస్థలూ రకరకాల మార్గాల్లో ప్రయత్నించినా ఎయిర్ క్వాలిటీ మెరుగుపడటంలేదు. సుప్రీంకోర్టు సైతం ఢిల్లీ పొల్యూషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చలికాలం కావడంతో పొల్యూషన్ ప్రభావం మరింత పెరిగింది. ఎయిర్ క్వాలిటీ ఇంకా దిగజారడంతో చిన్నపిల్లు, పెద్దవయసువాళ్లు అనారోగ్యానికి గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కూడా ప్రకటించారు. ఇలాంటి ప్రమాకర సమస్య పరిష్కారానికి మాజీ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ నడుంకట్టాడు.

మీ స్వార్థం కోసం విద్యార్థులను వాడుకుంటారా?: గౌతం గంభీర్ ఆగ్రహం

 వినూత్న పరిష్కారం..

వినూత్న పరిష్కారం..

ఎయిర్ పొల్యూషన్ ఇబ్బందులు తారాస్థాయికి చేరినవేళ ఎంపీ గంభీర్ ఢిల్లీలోని లజ్‌పత్‌నగర్ సెంట్రల్ మార్కెట్ లో.. 20 అడుగుల భారీ ఎయిర్ ప్యూరిఫయర్ టవర్ ను ఏర్పాటుచేయించాడు. ఈ టవర్ రోజుకు 600,000 క్యూబిక్ మీటర్ల గాలిని ప్యూరిఫై చేస్తుంది. గాలిలోని కాలుష్యకాకరకాలను శుద్ధి చేసి.. ఫ్రెష్ ఎయిర్ ను విడుదల చేస్తుంది. ఎయిర్ పొల్యూషన్ పరిష్కారానికి ఈ తరహా టవర్ ను రూపొందించడం, ఢిల్లీలో ఏర్పాటుచేయడం ఇదేతొలిసారి. తన పేరుతో నడిచే స్వచ్ఛంద సంస్థ ద్వారా గంభీర్ ఈ పని చేపట్టాడు.

పోరాటం ఆగదు..

పోరాటం ఆగదు..

శుక్రవారం ఈస్ట్ ఢిల్లీలో ఎయిర్ ప్యూరిఫయర్ టవర్ ప్రారంభోత్సవం సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ.. రాజధానిలో కాలుష్యంపై పోరాటమే తన ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పారు. కొద్ది నెలల కిందటే రూ.70 కోట్ల విలువైన రూపాయల విలువైన యంత్రాలు మరియు స్ప్రింక్లర్లను కొనుగోలు చేశామని, పొల్యూషన్ జీరో స్థాయికి చేరేదాకా పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. లజ్‌పత్‌నగర్ లో ప్రారంభించిన ఎయిర్ ప్యూరిఫయర్ ఒక నమూనా అని, దాని పనితీరు బాగుంటే నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇంకొన్ని టవర్లు ఏర్పాలుచేయిస్తానని చెప్పారు.

నేను మాటలు చెప్పే రకం కాదు..

నేను మాటలు చెప్పే రకం కాదు..

ఆటలోనైనా, రాజకీయాల్లోనైనా ఏరోజూ ఎమోషన్స్ ను దాచుకోని గౌతమ్ గంభీర్.. ఎయిర్ ప్యూరిఫయర్ టవర్ ప్రారంభోత్సవం సందర్భంలోనూ అదే తీరు కనబర్చాడు. ఢిల్లీ పొల్యూషన్ పై బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య రాజకీయ జగడం జరగడం, కేంద్రం సహకరించకపోవడం వల్లే పొల్యూషన్ పెరిగిందని సీఎం కేజ్రీవాల్ ఆరోపించడం తెలిసిందే. దీనికి కౌంటరిస్తూ.. ‘‘నా పేరు గౌతమ్ గంభీర్.. నేను మాటలు చెప్పి ఊరుకునే రకంకాదు.. చేతల్ని మార్పుని మాత్రమే నమ్ముతాను..''అని గౌతీ ట్విటర్ లో రాసుకొచ్చాడు. ఎంపీ చేసిన వినూత్న ప్రయత్నాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

English summary
BJP MP Gautam Gambhir on Friday inaugurated the prototype of the first-of-its-kind air purifier in Delhi's Lajpat Nagar Central Market.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X