వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘జాతీయగీతం కోసం 52 సెకన్లు నిలబడలేమా?’

సినిమా హాళ్లలో జాతీయగీతంపై సాగుతున్న చర్చపై భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించారు. గంభీర్‌ తన ట్విటర్‌ ఖాతా ద్వారా ఓ ఆసక్తికరమై సందేశాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సినిమా హాళ్లలో జాతీయగీతంపై సాగుతున్న చర్చపై భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించారు. గంభీర్‌ తన ట్విటర్‌ ఖాతా ద్వారా ఓ ఆసక్తికరమై సందేశాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

Recommended Video

National Anthem in Theatres : No Need To Stand To Prove Patriotism | Oneindia Telugu

'క్లబ్‌కి వెళ్తే సుమారు 20 నిమిషాల పాటు బయట నిల్చుని ఎదురుచూస్తాం, రెస్టారెంట్‌కి వెళ్తే 30 నిమిషాల పాటు బయట నిల్చుటాం. జాతీయ గీతం వినిపించినప్పుడు 52 సెకండ్ల పాటు నిల్చోలేమా? ఇది కష్టమా' అని గంభీర్ ప్రశ్నించాడు. గంభీర్ ట్వీట్‌కు విశేషమైన స్పందన వస్తోంది. చాలా మంది నెటిజన్లు ఆయనకు మద్దతు పలికారు. వ్యక్తిగత అవసరాల కోసం ఎంత సేపైనా నిల్చుకుంటారు కానీ, దేశ గీతం కోసం మాత్రం 52సెకన్లు కూడా నిల్చోలేరని పలువురు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

కాగా, దేశంపై తనకున్న ప్రేమను ఎన్నో సందర్భాల్లో మాటలు, చేతలు ద్వారా చాటుకున్నాడుత గంభీర్. అంతేగాక, గౌతమ్‌ గంభీర్‌ ఫౌండేషన్‌ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.

దేశ సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన అనేక మంది జవాన్ల పిల్లల్ని చదివిస్తున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఈ ఏడాది ఐపీఎల్‌లో నగదు రూపంలో అందుకున్న మొత్తాన్ని అమరవీరుల కుటుంబాలకు విరాళంగా అందజేయడం అభినందించదగ్గ విషయం.

ఇది ఇలావుంటే.. ప్రజలు తమ దేశభక్తి రుజువు చేసుకోవాలంటే సినిమా హాళ్లలో లేచి నిల్చోవాల్సిన అవసరం లేదని, జాతీయ గీతం వినిపిస్తున్నప్పుడు ఎవరైనా లేచి నిల్చోకపోతే వారిని దేశభక్తి లేనివారిగా పరిగణించలేమని సుప్రీంకోర్టు ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గౌతమ్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

English summary
Gautam Gambhir on Friday expressed strong views on the ongoing debate of standing for national anthem in movie theatres. The left-handed batsman took to Twitter to ask how tough it is to stand for the national anthem for less than a minute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X