వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాది హతం: ఒమర్, గంభీర్ మధ్య ట్విట్టర్ వార్

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, క్రికెటర్ గౌతమ్ గంభీర్ల మధ్య ట్విట్టర్‌లో యుద్ధం జరిగింది. ఒమర్ అబ్దుల్లా దేశభక్తిపై గౌతమ్ గంభీర్ అనుమానం వ్యక్తంచేయగా.. ఒమర్ అబ్దుల్లా తీవ్ర అసహనంతో ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ముందుగా కాశ్మీర్ గురించి సమగ్రంగా తెలుసుకుని తనతో చర్చకు రావాలని సూచించారు. 1988 నుంచి తమ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్‌ వేలాది మంది కార్యకర్తలను కోల్పోయిందన్నారు.

గత వారం రోజుల్లోనే తన ఇద్దరు సహచరులను తీవ్రవాదులు హతమార్చారని తెలిపారు. త్యాగాల గురించి తెలియని వ్యక్తుల నుంచి దేశ భక్తి, త్యాగాల గురించి తనకు పాఠాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. తన దేశభక్తిని ప్రశ్నిస్తూ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఒమర్ అబ్దుల్లా ఈ కామెంట్స్ చేశారు.

అంతకు ముందు ఒమర్ అబ్దుల్లా తీరుపై గౌతమ్ గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశ భౌగోళిక చిత్రపటాన్ని మార్చేందుకు ఒమర్ అబ్దుల్లా ప్రయత్నించారని ఆరోపించారు. కాశ్మీరీ యువతను సరైన మార్గంలో పెట్టేందుకు ఇతర రాజకీయ నాయకుల్లానే...ఒమర్ అబ్దుల్లా కూడా చేసిందేమీ విమర్శించారు.

మనన్ వని అనే ఉగ్రవాదిని ఇటీవల భద్రతా దళాలు మట్టుబెట్టిన నేపథ్యంలో మరో విద్యావంతుడైన కాశ్మీరీ యువకుడు ప్రాణాలు కోల్పోయాడని మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలో ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. వీరికి కౌంటర్‌గా గంభీర్ పై వ్యాఖ్యలు చేశారు. ఉన్నత విద్యావంతులు, ప్రతిభగలవారు ఉగ్రవాదులు కాలేరని.. ప్రాణాలు తీసేవారిని విద్యావంతులని సంభోదించడం ఏంటని గంభీర్ ప్రశ్నించారు.

ఉగ్రవాది హతం

శనివారం ఉదయం జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో పుల్వామాలోని బాబ్‌గుంద్ ప్రాంతంలో ఆపరేషన్‌ చేపట్టినట్లు తెలిపారు. భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.

Gautam Gambhir, Omar Abdullah Spar On Twitter Over Terrorists Killing

మృతి చెందిన ఉగ్రవాది వివరాలు, అతడు ఏ ఉగ్రసంస్థకు చెందిన వ్యక్తి అనే విషయాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలం నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ ముగిసిందని స్పష్టంచేశారు. రెండ్రోజుల క్రితం హంద్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్ర సంస్థకు చెందిన టాప్‌ కమాండర్‌ మనన్‌ బషీర్‌ వని, మరో ఉగ్రవాది ఆశిఖ్‌ హుస్సేన్‌లు హతమయ్యారు.

English summary
The killing of a terrorist in Jammu and Kashmir has triggered a war of words between the state's former Chief Minister Omar Abdullah and cricketer Gautam Gambhir. After Mr Gambhir held politicians including Mr Abdullah responsible for Mannan Wani, a scholar from Aligarh Muslim University, taking to terrorism, the National Conference leader said the cricketer was poorly informed about the dynamics of radicalisation in Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X