వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గే సెక్స్ నేరమే: పిటిషన్లను తిరస్కరించిన సుప్రీం కోర్టు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం (గే సెక్స్) నేరమంటూ ఇటీవల ఇచ్చిన తీర్పుపై పునర్‌సమీక్ష జరపాలంటూ దాఖలైన రివ్యూ పిటీషన్లను సుప్రీం కోర్టు మంగళవారం తిరస్కరించింది. స్వలింగ సంపర్కం శిక్షార్హమైన నేరమంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రంతో పాటు పలు హక్కుల సంఘాలు కూడా సవాలు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటీషన్లను పరిశీలించిన సుప్రీం కోర్టు మంగళవారం వాటన్నింటినీ తిరస్కరించింది.

కాగా సుప్రీం కోర్టు నిర్ణయం తమకు ఎంతో బాధ కలిగించిందని స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాము త్వరలోనే మరో పిటిషన్ వేస్తామని తెలిపారు. ప్రకృతికి విరుద్ధమైన గే సెక్స్ భారత చట్టాల ప్రకారం నేరమంటూ గత డిసెంబరులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను మంగళవారం సుప్రీం తిరస్కరించింది.

Gay sex still criminal: Supreme Court refuses to review verdict

కాగా గే సెక్స్ చట్ట వ్యతిరేకం కాదంటూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో వేలాది మంది స్వలింగ సంపర్కులు బాహటంగానే బయటికి వచ్చారనీ, ఇలాంటి పరిస్థితుల్లో స్వలింగ సంపర్కం శిక్షార్హమైన నేరమంటూ సుప్రీం కోర్టు తీర్పును వెలువరించడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని హక్కుల కార్యకర్తలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.

సుప్రీం తీర్పు స్వలింగ సంపర్కుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని కూడా వారు గట్టిగా వాదించారు. ఈ వాదనకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ కూడా మద్దతు తెలపడం గమనార్హం. సుప్రీం తీర్పు అనేక మంది స్వలింగ సంపర్కులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.

English summary
The Supreme Court has refused to review its controversial order restoring a colonial era ban on gay sex. The court today rejected review petitions filed by the Centre and gay rights activists, who said they were "extremely disappointed" but would file another petition soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X