వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూకాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పదవికి జీసీ ముర్ము రాజీనామా: కొత్త ‘కాగ్‌’గా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ గిరీష్ చంద్ర ముర్ము తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం ముర్ము తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు పంపారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

తదుపరి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్)గా నియమితులవుతారని సమాచారం. ప్రస్తుత కాగ్ రాజీవ్ మెహ్రిషి ఈ వారంలో పదవి విరమణ పొందనున్నారని, ఆయన స్థానంలో ముర్ము నియమితులు అవుతారని తెలిసింది.

 GC Murmu Submits Resignation as J&K Lieutenant Governor, Set to Be New CAG: Sources

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు ముర్ము తన రాజీనామా లేఖను పంపారని, అయితే, అది ఆయనకు చేరిందో లేదో తెలియదని, దాన్ని ఆయన అంగీకరించారా? లేక తిరస్కరించారా? అనే విషయంపై కూడా ఇంకా తెలియ రాలేదని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

జమ్మూకాశ్మీర్ తొలి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ముర్ము గత అక్టోబర్‌లో నియమితులయ్యారు. జమ్మూకాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 కింద జమ్మూకాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి ఏడాది కావస్తున్న ఆగస్టు 5 రోజునే ముర్ము తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా, బుధవారం ఉదయం ముర్ము జమ్మూకాశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై సమీక్షించడం గమనార్హం.

English summary
Jammu and Kashmir Lieutenant Governor Girish Chandra Murmu on Wednesday sent his resignation to President Ram Nath Kovind, said sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X