వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

11 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన జీడీపీ: చివరి త్రైమాసికంలో 3.1శాతంకు పడిపోయిన వృద్ధి రేటు

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా కారణంగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అయితే దేశ ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా సాగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన చర్యలను ప్రకటించి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థపై పలు అంతర్జాతీయ సంస్థలు కూడా కీలక వ్యాఖ్యలు చేశాయి. ఈ క్రమంలోనే భారత దేశ స్థూల జాతీయోత్పత్తిపై గణాంకాలు తాజాగా వెలువడ్డాయి. 2019 -20 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి జీడీపీ అంచనాలకు సంబంధించిన సమాచారం వెలువడింది.

చివరి త్రైమాసికంలో జీడీపీ

చివరి త్రైమాసికంలో జీడీపీ

కరోనావైరస్‌తో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పగా ఆ తర్వాత అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్ కారణంగా దేశ ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ క్రమంలోనే దేశ ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా సాగింది. ఈ క్రమంలోనే స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) పై విడుదలైన గణాంకాలు ఆసక్తికరంగా మారాయి. 2019-20 ఆర్థిక సంవత్సం చివరి త్రైమాసికానికి అంటే జనవరి నుంచి మార్చి వరకు జీడీపీ వృద్ధిరేటు 3.1శాతం మేరా పడిపోయిందని కేంద్ర గణాంకాల శాఖ లెక్కలు విడుదల చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇదే చివరి త్రైమాసికానికి ఈ లెక్క 5.7శాతంగా ఉన్నిందని వెల్లడించింది.

 గత 11 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా...

గత 11 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా...

2019-20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 4.2శాతం ఉంటుందని అంచనా వేసింది. గత 11 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా జీడీపీ పడిపోయింది. 2018-19లో జీడీపీ 6.1శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఆర్బీఐ అంచనా మరోలా ఉంది. 2019-20కి జీడీపీ 5శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. అయితే జాతీయ గణాంకాల సంస్థ ఈ ఏడాది జనవరి ఫ్రిబవరిలో ఇచ్చిన లెక్కల ఆధారంగా ఆర్బీఐ అంచనా వేసింది. అయితే ఇక్కడ లాక్‌డౌన్ మార్చి నెల చివరి వారం నుంచే అమల్లోకి వచ్చింది. అంతకుముందు లాక్‌డౌన్ అనేది లేదన్న విషయాన్ని గమనించాలని ఆర్థిక నిపుణులు గుర్తుచేస్తున్నారు.

2011-12 ఆర్థిక సంవత్సరంలో ఎలాగైతే ఉన్నిందో..

2011-12 ఆర్థిక సంవత్సరంలో ఎలాగైతే ఉన్నిందో..

ఇక 2020 ఆర్థిక సంవత్సర్ మూడో త్రైమాసికంలో జీడీపీ గత ఏడేళ్లలో ఎప్పుడూ లేనంతగా 4.7శాతానికి పడిపోయింది. తొలి రెండు త్రైమాసికాల్లో జీడీపీ 5.1శాతం, 5.6శాతంగా రికార్డయ్యాయి. ఇక 2011-12 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ ఎలాగైతే ఉన్నిందో... ఇప్పుడు కూడా అంటే 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి అలాంటి పరిస్థితే కనిపిస్తోందని చెప్పారు. నాడు రూ.38.04 లక్షల కోట్లు ఉండగా ఇప్పుడు రూ.36.90 లక్షల కోట్లు ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

ఎస్బీఐ-ఆర్బీఐలు ఏం చెప్పాయి..?

ఎస్బీఐ-ఆర్బీఐలు ఏం చెప్పాయి..?


ఎనిమిది మౌలిక సదుపాయాల రంగాల ఉత్పత్తి ఏప్రిల్‌లో 38.1 శాతం కుదించబడిందని, ఇది సంవత్సరానికి 5.2 శాతం వృద్ధిని సాధించిందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించిన నేపథ్యంలో తాజా జీడీపీ గణాంకాలు వెలువడటం కాస్త ఆలోచించాల్సిన విషయమే అని నిపుణులు చెబుతున్నారు. ఇక మార్చి నెలలో లాక్‌డౌన్‌ అమలయ్యేసరికి జీడీపీ 1.2శాతం ఉంటుందని అంచనా వేసింది. ఇక 2020 ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు 4.2శాతంగా ఉంటుందని అంచనా వేయగా 2021వ సంవత్సరానికి ఇది నెగిటివ్‌లోకి జారిపోయే ప్రమాదం ఉందని ఒక నివేదికలో ఎస్బీఐ పేర్కొంది. ఎస్బీఐ నివేదిక ఇలా ఉంటే ఆర్బీఐ రిపోర్టు కూడా జీడీపీ నెగిటివ్‌లోకి జారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇందుకు కారణం కరోనావైరస్ అని పేర్కొంది. కోవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో డిమాండ్ తగ్గిపోయిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ఆర్థిక వృద్ధి 2020-21కి నెగిటివ్‌లోకి వెళుతుందని శక్తికాంతదాస్ చెప్పారు.

English summary
GDP growth slows to 3.1% in January-March quarter reveals govt report
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X