వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదేళ్ల కనిష్టానికి పడిపోయిన జీడీపీ.. పాయింట్ 8 శాతం తగ్గిన వృద్ధి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : స్టూల దేశీయ ఉత్పత్తి భారీగా పడిపోయింది. 2019-2020 మొదటి త్రైమాసికం 5 శాతానికి చేరింది. గత క్వార్టర్‌లో 5.8 నుంచి .. పాయింట్ 8 శాతానికి తగ్గింది. ఇది గత ఐదేళ్లలో కనిష్టమని పేర్కొంది. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా జీడీపీ 6.8గా ఉంది. కానీ చివరి క్వార్టర్‌లో మాత్రం 5.8 శాతంగా ఉందని అధకారులు పేర్కొన్నారు. అదీ ఆగస్టు త్రైమాసికానికి మరింత దిగజారిందని వివరించారు.

ఆంధ్రా కోడలి చేతుల మీదుగా ఆంధ్రా బ్యాంకు కనుమరుగుఆంధ్రా కోడలి చేతుల మీదుగా ఆంధ్రా బ్యాంకు కనుమరుగు

2018-2019 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయ ఉత్పత్తి జనవరి-మార్చి త్రైమాసికంలో 5.8 శాతానికి చేరింది. దేశ ఆర్థికరంగం కుదేలవడంతో .. జీడీపీ క్రమంగా తగ్గుతుంది. ఇదీ ముఖ్యంగా ఆటో, తయారీ, రియల్ ఎస్టేట్ రంగాలపై ప్రభావం చూపనుంది. దీనికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ఓ కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, బ్రెగ్జిట్, దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపిందని .. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువని తెలుస్తోంది. దీనికితోడు విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఆయా సంస్థలు వెనుకడుగు వేస్తున్నాయి.

GDP growth sees sharp drop to 5% from 5.8% last quarter

దేశీయ ఉత్పత్తి ప్రభావం బ్యాంకులపై కూడా పడింది. దీంతో బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతోపాటు జాతీయ బ్యాంకులు తాము తీసుకున్న నగదును రిజర్వ్ బ్యాంక్‌కు సకాలంలో చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాయి. దీనికితోడు ఆర్బీఐ రెపో రేటును కూడా తగ్గించింది. కాసేపటి క్రితమే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. దేశంలోని ప్రధాన బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఆర్థిక మందగమనానికి బ్యాంకుల విలీనం ఊతమిస్తోందని అంచనా వేశారు.

English summary
the Gross Domestic Product (GDP) growth for the first quarter of the financial year 2019-20 dropped to five per cent, a sharp decline of 0.8 per cent points compared to the last quarter that ended in March. The current GDP numbers are the worst in the last five years. The financial year 2018-19 ended with an overall Gross Domestic Product (GDP) growth rate of 6.8 per cent, which was marginally lower compared to the year before. The growth rate for the fourth quarter of FY 2018-19 (January to March) stood at 5.8 per cent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X