• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఎట్టకేలకు తల్లి చెంతకు గీత... అప్పట్లో సుష్మా చొరవతో పాక్ నుంచి భారత్‌కు...

|

చిన్నతనంలోనే తప్పిపోయి.. అనుకోని పరిస్థితుల్లో పాకిస్తాన్ చేరి... 15 ఏళ్ల తర్వాత తిరిగి స్వదేశం ఇండియాకు చేరిన గీత గుర్తుందా...? ఐదేళ్ల క్రితం అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చొరవతో భారత్ చేరిన గీత... ఎట్టకేలకు తన కుటుంబ సభ్యులెవరో తెలుసుకోగలిగింది. గత ఐదేళ్లుగా బిహార్,ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర,తెలంగాణ రాష్ట్రాల్లో ఆమె కుటుంబ మూలాల కోసం వెతుకుతుండగా ఎట్టకేలకు మహారాష్ట్రలోనే ఆమె తల్లి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా డీఎన్ఏ పరీక్షలు చేయనప్పటికీ... ఆ తల్లి చెప్పిన ఆధారాలు,వివరాల ఆధారంగా గీత తల్లి ఆమే అని నిర్దారించారు.

గీత మాతృమూర్తి మీనా వాఘ్‌మేర్...

గీత మాతృమూర్తి మీనా వాఘ్‌మేర్...

గీత మాతృమూర్తి మహారాష్ట్రలోని పర్భనీ జిల్లాకు చెందిన మీనా వాఘ్‌మేర్(71)గా గుర్తించినట్లు ఆనంద్ సర్వీసెస్ సొసైటీ ప్రతినిధి జ్ఞానేంద్ర పురోహిత్ తెలిపారు. చిన్నతనంలోనే తప్పిపోయిన తన కుమార్తెకు పొట్ట భాగంలో కాలిన గాయపు మచ్చ ఉన్నట్లు ఆమె చెప్పారన్నారు. ఆమె చెప్పినట్లే గీతకు అదే చోట కాలిన గాయపు మరక ఉందన్నారు. మీనా తన మొదటి భర్త సుధాకర్ వాఘ్‌మేర్‌తో గీతకు జన్మనిచ్చిందని చెప్పారు. కొన్నేళ్ల క్రితం అతను చనిపోవడంతో రెండో వివాహం చేసుకుందని... ప్రస్తుతం అతనితో కలిసి ఔరంగాబాద్‌లో ఉంటోందని తెలిపారు.గీతను కలిసిన తర్వాత ఆమె తల్లి మీనా ఆనందంతో కంటతడి పెట్టుకుందని చెప్పారు. మీనా చాలానే మాట్లాడినప్పటికీ... దివ్యాంగురాలు(చెవిటి,మూగ) కావడంతో గీత ఆమె మాటలను అర్థం చేసుకోలేకపోయిందన్నారు.

ఆమెను గుర్తించింది జ్ఞానేంద్ర పురోహిత్...

ఆమెను గుర్తించింది జ్ఞానేంద్ర పురోహిత్...

అక్టోబర్ 26,2015న గీతను పాకిస్తాన్‌ను నుంచి తీసుకొచ్చాక ఇండోర్‌కు చెందిన పహల్ అనే ఓ ఎన్‌జీవో సంస్థకు ఆమె బాధ్యతలను అప్పగించారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని పర్భనీలో ఆమెకు సైగల భాషలో శిక్షణ ఇప్పించారు.ఆ తర్వాత జులై 20,2020న ఇండోర్‌కే చెందిన ఆనంద్ సర్వీసెస్ సొసైటీకి ఆమె బాధ్యతలు అప్పగించారు. ఇదే క్రమంలో గతేడాది డిసెంబర్‌లో ఆ సంస్థకు చెందిన జ్ఞానేంద్ర పురోహిత్ పర్భనీకి వెళ్లగా... అదే పట్టణంలో గీత తల్లి వాఘ్‌మేర్‌ను ఆయన గుర్తించినట్లు పహెల్ సంస్థ ప్రతినిధి ఆనంద్ సెల్గావ్‌కర్ తెలిపారు. గీత కుటుంబ సభ్యులను గుర్తించేందుకు గత ఐదేళ్లలో ఉత్తరప్రదేశ్,బిహార్,తెలంగాణ,రాజస్తాన్‌లకు చెందిన పదుల సంఖ్యలో కుటుంబాలను స్క్రీనింగ్ చేసినట్లు వెల్లడించారు.

తరుచూ తల్లిని కలుస్తోన్న గీత...

తరుచూ తల్లిని కలుస్తోన్న గీత...

ప్రస్తుతం గీత గత నెలన్నర రోజులుగా పర్భనీలోనే ఉంటోందని... తరుచూ తన తల్లి మీనాను కలుస్తోందని సెల్గావ్‌కర్ తెలిపారు. మీనా-గీతలకు డీఎన్ఏ టెస్టు ఎప్పుడు నిర్వహించాలన్నది ప్రభుత్వ అధికారులే నిర్ణయిస్తారని చెప్పారు. పాకిస్తాన్‌లో గీత ఆశ్రయం పొందిన ఎన్‌జీవో సంస్థ బిల్కీస్ ఈది నిర్వాహకురాలు ఈ విషయంపై స్పందించినట్లు పాక్ మీడియా వెల్లడించింది. గీత తన తల్లిదండ్రులను చేరుకుందని ఆమె పేర్కొన్నట్లు తెలిపింది. 11,12 ఏళ్ల వయసులో ఓ రైల్వే స్టేషన్ సమీపంలో.. తప్పిపోయిన ఆ బాలికను గుర్తించామని... ఆ తర్వాత కరాచీలోని తమ ఎన్‌జీవో సంస్థకు తీసుకొచ్చి ఆశ్రయం కల్పించామని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేసుకున్నట్లు చెప్పుకొచ్చింది.

స్పందించిన పాక్ ఎన్‌జీవో...

స్పందించిన పాక్ ఎన్‌జీవో...

పాకిస్తాన్‌లోని బిల్కీస్ ఈదీ ఎన్‌జీవో సంస్థనే ఆ బాలికకు గీత అని పేరు పెట్టింది. అప్పటినుంచి 15 ఏళ్ల పాటు అక్కడే పెరిగింది. ఐదేళ్ల క్రితం కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ చొరవతో భారత్ చేరింది. అప్పటినుంచి గీతను ఆమె కుటుంబ సభ్యుల చెంతకు చేర్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నో కుటుంబాలు గీత తమ బిడ్డేనని ముందుకొచ్చాయి. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా,మహబూబాబాద్ జిల్లాలకు చెందిన రెండు కుటుంబాలు కూడా గీత తమ బిడ్డేనని ముందుకొచ్చాయి. ఇలా ఎన్నో కుటుంబాలను స్క్రీనింగ్ చేయగా.. చివరకు మహారాష్ట్రలోని పర్భనీకి చెందిన మీనా వాఘ్‌మేర్ గీత తల్లి అని అధికారులు నిర్దారించారు. ఎట్టకేలకు గీత తన మాతృమూర్తిని చేరడంపై చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Geeta, the deaf and mute girl, who was rescued from Pakistan in 2015 by then Extern Affairs Minister Sushma Swaraj, has finally found her family in Maharashtra. Geeta returned to India on October 26, 2015 after intervention by Swaraj. She was initially lodged at a facility of a hearing and speech impaired institute run by an Indore-based NGO.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X