వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్‌భవన్‌కు తాకిన రాజకీయ సంక్షోభం: ఎమ్మెల్యేలతో ముట్టడి: అసెంబ్లీ భేటీ కోసం పట్టు..నినాదాలు

|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్థాన్‌లో చెలరేగిన రాజకీయ సంక్షోభం సెగ.. రాజ్‌భవన్‌కు తాకింది. సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన విజ్ఙప్తిని గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా తిరస్కరించడంతో అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. రాజ్‌భవన్‌ను ఎవ్వరైనా ముట్టడించే అవకాశం ఉందంటూ హింట్ ఇచ్చిన అశోక్ గెహ్లట్.. తానే ఆ పని చేశారు. తనకు మద్దతు పలుకుతోన్న ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌ను ముట్టడించారు. ఫలితంగా రాజ్‌భవన్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అశోక్ గెహ్లాట్.. రాజ్‌భవన్ ప్రధాన భవనంలో గవర్నర్‌ కల్‌రాజ్ మిశ్రాతో భేటీ కావడానికి వెళ్లగా.. ఎమ్మెల్యేలందరూ ఆవరణలో బైఠాయించారు. అశోక్ గెహ్లాట్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. అసెంబ్లీని వెంటనే సమావేశపర్చాలంటూ నినదించారు. ఈ సందర్భంగా వారు సచిన్ పైలెట్, ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. స్పీకర్ సీపీ జోషి వేసిన అనర్హత వేటు సరైనదేనని అన్నారు.

Gehlot meets governor, Cong MLAs raise slogans for assembly session at Raj Bhavan

అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు అశోక్ గెహ్లాట్.. గవర్నర్‌ను కలిశారు. ఆయన కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపర్చడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడం పట్ల అశోక్ గెహ్లాట్ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిళ్లతోనే గవర్నర్ అసెంబ్లీ భేటీకి అనుమతి ఇవ్వట్లేదని ఆరోపించారు.

Recommended Video

Audio Tapes కలకలం... Congress దూకుడు, రెబల్‌ ఎమ్మెల్యేల కు Show Cause Notices, BJP వ్యూహం ?

అనంతరం మళ్లీ ఆయన మధ్యాహ్నం 3 గంటల రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. హోటల్‌లో ఉంటోన్న తన అనుకూల ఎమ్మెల్యేలతో కలిసి అశోక్ గెహ్లాట్ నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. తన బలాన్ని ప్రదర్శించారు. అసెంబ్లీని సమావేశ పర్చాలంటూ శాసనసభ్యులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారని గవర్నర్‌కు వివరించారు. వారి డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని సోమవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరారు.

English summary
After the Rajasthan High Court maintained 'status quo' as per the Supreme Court order, Rajasthan Chief Minister Ashok Gehlot held a press conference and said that he had already written to the Governor asking for a state assembly session to be convened. "I want to request the Rajasthan governor again to call for an assembly session by Monday so, we could discuss the difficulties faced in the COVID times and also prove majority in the house", Said CM Gehlot
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X