వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా జనరల్ బిపిన్ రావత్ నియామకం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పేరును కేంద్రం ఖరారు చేసింది. ఆర్మీ చీఫ్‌గా మంగళవారం పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో బిపిన్ రావత్ పేరును చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ప్రకటించడం విశేషం. భారత్‌కు చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌ పోస్టును తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోడీ చెప్పారు. ఇప్పుడు ఆ పదవికి ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పేరును ప్రకటించి మాట నిలబెట్టుకున్నారు.

మిలటరీకి సంబంధించి అన్ని వ్యవహారాలను చూసుకునేందుకు సలహాలు ఇచ్చేందుకు సలహాదారుడు ఉండాలనే సూచనను మోడీ సర్కార్ అమలు చేసింది. ఈ సూచన గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉంది. 1999 కార్గిల్ సంక్షోభం తర్వాత అత్యున్నత మిలటరీ పోస్టును క్రియేట్ చేయాలని అప్పటి కమిటీ సూచించింది. ఇదిలా ఉంటే ఈనెల 24న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్టును ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసింది. అంతేకాదు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ బాధ్యతలు ఇతర వ్యవహారాలపై కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్టుకు ఇండియన్ ఆర్మీ, లేదా ఇండియన్ నేవీ, లేదా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ నుంచి నాలుగు నక్షత్రాలు కలిగి ఉన్న అధికారిని నియమించడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది.

General Bipin Rawat named as Indias first Chief of Defence Staff

ఇక ఆ తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు సంబంధించిన నిబంధనలను సవరించింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా నియమించబడ్డ వ్యక్తి 65 ఏళ్ల వరకు ఆ స్థానంలో కొనసాగుతారని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే త్రివిధ దళాల అధిపతులు ఆ పదవిలో మూడేళ్లు లేదా 62 ఏళ్లు వచ్చాక పదవీవిరమణ పొందుతారని పేర్కొంది. ఇక సీడీఎస్‌ బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తి త్రివిధ దళాల అధిపతులపై ఉంటారని స్పష్టం చేసింది. ఇక కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మిలటరీ వ్యవహారాలు చూసుకుంటారని కేంద్రం తెలిపింది. ఆయుధాల కొనుగోలు, శిక్షణ, సిబ్బంది, మిలటరీ కమాండ్ల వ్యవస్థలో మార్పులు చేర్పులు వంటివి నిర్వర్తిస్తారని పేర్కొంది.

మొత్తంగా త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు కార్యక్రమాలు చీఫ్ ఆఫ్ ఢిఫెన్స్ స్టాఫ్ నేతృత్వంలోనే జరుగుతాయని తెలుస్తోంది. ఇకపై ఆయుధాల కొనుగోలు విషయంలో నిధులు దుర్వినియోగం కాకుండా చూసే బాధ్యత కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌పై ఉంటుందని కేంద్రం వెల్లడించింది.

English summary
Indian Army chief General Bipin Rawat has been named as India's first Chief of Defence Staff. General Rawat was named the Chief of Defence Staff just a day before he was to retire from service after completeing a full three-year term as the Chief of Army Staff.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X