వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసక్తికరం: కాంగ్రెస్ టిక్కెట్ కావాలా, ఫేస్‌బుక్‌లో 15వేలు, ట్విట్టర్‌లో 5వేలమంది ఉండాలి

By Srinivas
|
Google Oneindia TeluguNews

భోపాల్: త్వరలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఓ ఆసక్తికర ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ టిక్కెట్ కావాలంటే ఫేస్‌బుక్‌లో 15,000 లైక్స్, ట్విట్టర్‌లో 5000 మంది ఫాలోవర్స్ ఉండాలట!

మధ్యప్రదేశ్‌లో ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. శివరాజ్ సింగ్ చౌహాన్ నుంచి పగ్గాలు లాక్కోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంతోపాటు సోషల్ మీడియాను సాధ్యమైనంత వినియోగించుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని భావిస్తోంది.

Get 15000 Likes on Facebook, 5000 Followers on Twitter: Congress to Ticket Seekers in MP

ఇందులో భాగంగా టికెట్ ఆశిస్తున్న నేతలకు సరికొత్త పరీక్ష పెట్టింది.
అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న నేతలకు సోషల్ మీడియాపై పట్టు ఉంటే సరిపోతుందని, అదే పెద్ద అర్హతని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలిపింది. తమ సొంత ఫేస్‌బుక్ ఖాతాకు 15 వేల లైక్‌లు, ట్విట్టర్‌లో ఐదువేల ఫాలోవర్లు ఉంటే టికెట్ అర్హులేనని తేల్చి చెప్పింది. అలాగే, బూత్ లెవల్‌లోనూ వాట్సాప్ గ్రూపులు నిర్వహించాలని పేర్కొంది. కాంగ్రెస్ కమిటీ చేసే ప్రతీ ట్వీట్‌ను రీట్వీట్ చేయాలని సూచించింది.

English summary
Soon after reshuffling its IT Cell, Madhya Pradesh Congress on Monday issued a diktat to all those aspiring for a ticket for the upcoming elections, that they need to get at least 15,000 likes on their Facebook pages and a minimum of 5,000 followers on Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X