వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రహ్మచారిగా ఉండటం కష్టం, పెళ్లి చేసుకోండి: యువతకు అన్నాహజారే

యువత పెళ్లి చేసుకోవాలని, తనలాగా బ్యాచిలర్‌గా మిగిలిపోవద్దని అన్నా హజారే పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: యువత పెళ్లి చేసుకోవాలని, తనలాగా బ్యాచిలర్‌గా మిగిలిపోవద్దని అన్నా హజారే పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. బ్రహ్మచారిగా ఉండటం సులువు కాదని, పదునైన కత్తిపై నడవడంకంటే అది చాలా కష్టమని చెప్పారు. యువత తమ ఇష్టానికి అనుగుణంగా రాజకీయాల్లోకి రావాలని లేదా ఏదైనా ఇతర రంగాన్ని ఎంచుకోవాలన్నారు.

Get married, bachelor Anna Hazare tells youth

కానీ, తనను మాత్రం అనుకరించవద్దని అన్నా హజారే హితవు పలికారు. తాను బ్రహ్మచారిలా మిగిలిపోయానని, వివాహం చేసుకోకుండా ఉండాలని నేనెవరికీ చెప్పలేదన్నారు.

పురాణాల్లో మహర్షి విశ్వామిత్ర గురించి ప్రస్తావించారు. మనసు చాలా చంచలమైనదన్నారు. వేల ఏళ్లపాటు తపస్సులో ఉన్న విశ్రామిత్రుని మనసు కూడా మేనక ముందు చలించిందన్నారు.

పెళ్లి చేసుకోకుండా సమాజాభివృద్ధికే జీవితాన్ని అంకితం చేయాలని పాతికేళ్ల వయసులో తాను నిర్ణయించుకున్నట్లు అన్నా హజారే తెలిపారు.

English summary
Social activist Anna Hazare, himself a bachelor, today had some advice to offer those who wished to join politics -- get married. The Gandhian activist urged the youth not to follow in his footsteps and remain unmarried, for it was difficult to lead an unblemished life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X