వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీ బట్టలు విప్పేస్తా.. కారు దిగిపో యూవతికి క్యాబ్ డ్రైవర్ బెదిరింపు..!!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : క్యాబుల్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయని .. కస్టమర్ కేర్ సపోర్ట్‌కి కూడా ఫిర్యాదు చేయొచ్చు అని చెప్తారు. కానీ వాస్తవం మాత్రం విభిన్నం కొందరు డ్రైవర్ల తీరు మాత్రం మారడం లేదు. పేరున్న క్యాబ్‌లలో బెదిరింపులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఐటీ హబ్ బెంగళూరులో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ మహిళతో ఉబర్ డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు.

క్యాబులో వస్తుంటే ..

క్యాబులో వస్తుంటే ..

బెంగళూరుకు చెందిన ఓ మహిళ గతరాత్రి తన ఫ్రెండ్స్‌తో పార్టీకెళ్లారు. అక్కడ పార్టీ పూర్తి చేసుకొన్నారు. అయితే ఇంటికి తిరిగొచ్చేందుకు క్యాబ్ బుక్ చేశారు. అతని ఫ్రెండ్ ఉబెర్‌లో రైడ్ చేశారు. అయితే అందులో ఉన్న డ్రైవర్ ర్యాష్‌గా ఉన్నాడని బాధిత యువతి వాపోయింది. కారు వెళ్తుంటే డ్రైవర్ అతని స్నేహితుడికి ఫోన్ చేసి కస్టమర్లను తిట్టాడని వాపోయారు. అయినా ఏమీ అనలేదని ... కానీ ఫోన్ అయిపోయాక తనను చూస్తూ మాట్లాడుతూ గొడవపడ్డాడని తెలిపింది. చదువుకున్నావ్ కదా.. డ్యూటీ అయిపోగానే ఇంటికెళ్లకుండా ఎందుకు తాగుతారని ప్రశ్నించడంతో గొడవ మొదలైంది.

తాగలేదని చెబుతుంటే ..

తాగలేదని చెబుతుంటే ..

తాను డ్రింక్ చేయలేదని .. కానీ తనను డ్రైవర్ మందు తాగావని ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. తనను అసభ్య పదజాలంతో దూషించాడని నిట్టూర్చారు. అంతేకాదు అతని షూ తుడవడానికి కూడా పనికిరానని దూషించాడని వెక్కి వెక్కి ఏడ్చింది. అతని ప్రవర్తన బాగోలేకపోవడంతో ఉబర్ సేప్టీ బటన్ నొక్కానని చెప్పారు. అయితే కస్టమర్ కేర్ తనకు కాకుండా డ్రైవర్‌కు ఫోన్ చేశారని తెలిపారు. తాను తాగి ఉన్నానని డ్రైవర్ సమాధానం చెప్పాడని తెలిపారు. మరోసారి కస్టమర్ కేర్‌‌కు ఫోన్ చేస్తే క్యాబ్ దిగాలని సూచించారని గుర్తుచేసుకున్నారు.

రాని క్యాబ్ ..

రాని క్యాబ్ ..

మరో క్యాబ్ బుక్ చేశామని వారు పేర్కొన్నారు. వారు చెప్పడంతో కారు దిగానని తెలిపారు. అయితే ఆ సమయంలో రాత్రి 11.15 అవుతుందని .. మరో క్యాబ్ రాకపోవడంతో కారులో ఉన్నానని గుర్తుచేశారు. ఇంతలో డ్రైవర్ తన వికృత ప్రవర్తనను చూపించాడన్నారు. కారు దిగాలని బలవతం చేశాడని .. లేదంటే బట్టలు విప్పేస్తానని బెదిరించాడని వాపోయారు. ఎలాగోలా కారు దిగి ... తన ఫ్రెండ్ మరో కారు బుక్ చేస్తే అందులో ఇంటికొచ్చేశానని పేర్కొన్నారు. వారు చెప్పిన క్యాబ్ రాలేదని .. తన ఫ్రెండ్ బుక్ చేసిన కారులో వచ్చానని ... అక్కడే ఉంటే తన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తనకు జరిగిన అవమానాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మిగతా వారు కూడా తమకు జరిగిన అవమానాలను పంచుకుంటున్నారు.

English summary
We recently came across another incident of a woman being harassed by an Uber driver in Bengaluru. Aparna Balachander, who is a resident of Bengaluru in Karnataka, took to Twitter to share the nightmarish incident. She tweeted her experience and details of her trip, "Hi guys, I need you all to take a minute and read my traumatic experience with the cab driver while taking an Uber cab tonight! Help me spread more caution and awareness among women so that they don't go through what I did!"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X