వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఘర్ వాపసీ’ టార్గెట్ 15కోట్ల మంది: సాధ్వి ప్రాచీ

|
Google Oneindia TeluguNews

అలీఘర్: విశ్వహిందూ పరిషద్ ముఖ్య నాయకురాలు సాధ్వి ప్రాచీ ఆర్యా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యానికి ముందు బలవంతంగా మతం మార్చబడిన 15కోట్ల మంది హిందువులు తిరిగి హిందువులుగా మారే వరకు ‘ఘర్ వాపసీ' కొనసాగుతుందని చెప్పారు.

రాంలీలా మైదానంలో సాధ్వి ప్రాచీ మాట్లాడుతూ.. ‘స్వాతంత్ర్యానికి పూర్వం బలవంతంగా మతమార్పిడికి గురైన 15కోట్ల మంది ప్రజలను తిరిగి హిందువులుగా మార్చే వరకు ఘర్ వాపసీ కొనసాగుతుంది' అని అన్నారు. మహాత్మా గాంధీకి జాతిపితా అనే పేరు శాశ్వతం కాదని అన్నారు.

‘మహాత్మా గాంధీకి జాతిపితా అనే పేరు శాశ్వతం కాబోదు. ఎందుకంటే చాలా మంది నేతలు స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు. వారందరు కొందరి వల్ల కనుమరుగయ్యారు' అని చెప్పారు. స్వాతంత్ర్యం తీసుకొచ్చిన ఘనతను తప్పుగా గాంధీకి ఆపాదించారు, ఇది వీర్ సవార్కర్, భగత్ సింగ్‌కు చెందుతుందని అన్నారు.

Ghar Wapsi will go on till all 15 crore people are reconverted: Sadhvi Prachi Arya

భారతదేశంలో హిందువుల సంఖ్యను పెంచడం విహెచ్‌పి కర్తవ్యమని తెలిపారు. ఇతరుల పెరుగుదల సంఖ్యతో పోలిస్తే హిందువులు పెరుగదల తక్కువ ఉందని ప్రాచీ పేర్కొన్నారు. ‘నాకు, బిజెపి ఎంపి సాక్షి మహారాజ్‌కు చాలా మంది నుంచి బెదిరింపులు వస్తున్నాయి. హిందువుల హక్కుల కోసం మేము అలాంటి బెదిరింపులకు భయపడం' అని తేల్చి చెప్పారు.

కాగా, అలీఘర్‌కు పూర్వ నామమైన ‘హరిఘర్' పేరును అలీఘర్‌కు పెట్టేవరకు పోరాటం సాగిస్తామని విహెచ్‌పి ప్రకటించింది. ఈ సమావేశానికి సీనియర్ బిజెపి నేత, ఎంపి సతీష్ గౌతమ్, నగర మేయర్ శకుంతలా భారతి హాజరయ్యారు.

English summary
Sadhvi Prachi Arya, a prominent Vishwa Hindu Parishad (VHP) leader, has said that the 'Ghar Wapsi' programme will continue till the fifteen crore people who, she claimed, have left the Hindu fold post Independence, are "reconverted to Hinduism".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X