వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2500 మందిని మోసం.. చౌకగా ఫోన్లు, ఈఎంఐ పేరుతో వల. అరెస్ట్, మొబైల్స్ సీజ్..

|
Google Oneindia TeluguNews

అమాయకుల అమాయకత్వమే పెట్టుబడిగా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ ధరకు వస్తువు వస్తోందని ఆశపడటంతో మొదటికే మోసం వస్తోంది. అలా ఘజియాబాద్‌కి చెందిన ఒకతను.. ఒకరు కాదు ఇద్దరు కాదు 2500 మందిని మోసం చేశాడు. తక్కువ ధరకు మొబైల్ ఇప్పిస్తానని, ఈఎంఐ అవకాశం కూడా ఉంది అని నమ్మబలికాడు. అయితే ఇర్ఫాన్ పఠాన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. భారీ మోసం బయటపడింది.

 స్నేహితులతో కలిసి మోసం..

స్నేహితులతో కలిసి మోసం..

ఘజియాబాద్ ప్రతాప్ విహార్‌కు చెందిన జితేందర్ సింగ్ (32) ఈజీ మనీ కోసం అలవాటుపడ్డాడు. తన స్నేహితులు ప్రవీణ్ కుమార్, రాజత్ శుక్లాతో కలిసి ఏం చేయాలని ఆలోచించాడు. www.mobilityworld.in పేరుతో వెబ్ పోర్టల్ క్రియేట్ చేశాడు. తక్కువ ధరకే మొబైల్స్ ఇప్పిస్తామని చెప్పాడు. ఈఎంఐకి కూడా ఫోన్లు అందజేస్తామని తెలిపాడు. ఇతని వలలో ఇర్ఫాన్ అనే యువకుడు పడిపోయాడు. మొబైల్ కోసం అతను గూగుల్‌లో సెర్చ్ చేశాడు. వెబ్ సైట్ చూసి టెంప్ట్ అయ్యాడు. తక్కువ ధరకు మొబైల్స్ అని చూసి.. అట్రాక్ట్ అయ్యాడు. ఈఎంఐకి కూడా మొబైల్ ఇప్పిస్తామని చెప్పాడు. దీంతో ఇర్ఫాన్ వారితో కాంటాక్ట్ అయ్యాడు. అలా మూడుసార్లు నగదు ట్రాన్స్ ఫర్ చేశాడు.

మూడు విడతల చెల్లింపు..

మూడు విడతల చెల్లింపు..

వెబ్ సైట్ ఓపెన్ చేసి తొలుత డిసెంబర్ 14, 2019లో రూ.1499 ట్రాన్స్ ఫర్ చేశారు. తర్వాత మరోసారి డిపాజిట్ చేయాలని కోరగా.. రెండుసార్లు ట్రాన్స్ ఫర్ చేశారు. అలా రూ.5998 వరకు నగదు బదిలీ చేశారు. కానీ అతనికి మొబైల్ రాలేదు. నగదు ఇవ్వాలని కోరితే కాలం వెళ్లదీశారే తప్ప రిటన్ చేయలేదు. తర్వాత వెబ్ సైట్ కనిపించకుండా పోయింది. దీంతో ఇర్పాన్ పఠాన్ పోలీసులను ఆశ్రయించాడు. తనకు జరిగిన అన్యాయాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన వివరించాడు.

Recommended Video

Nutan Naidu: శిరోముండనం ఘటన తర్వాత Bigg Boss Fame నూతన్ చేసిన మరిన్ని మోసాలు వెలుగులోకి...
అరెస్ట్, మొబైల్స్ సీజ్

అరెస్ట్, మొబైల్స్ సీజ్

కేసు నమోదు చేసిన పోలీసులు.. జితేందర్ సింగ్‌పై ఫోకస్ చేశారు. ఈ నెల 15వ తేదీన అరెస్ట్ చేశారు. అతని నుంచి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జితేందర్.. ఇలా 2500 మంది వరకు మోసం చేశారని గుర్తించారు. అయితే నేరంలో భాగస్వాములయిన ప్రవీణ్, రాజత్ పరారీలో ఉన్నారని.. వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

English summary
Police have arrested one Jitender Singh, a resident of Pratap Vihar in Ghaziabad, for cheating around 2,500 people from across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X