వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాయుకాలుష్యంలో భారత నగరాలే టాప్.. అగ్రస్థానంలో నిలిచింది ఈ సిటీనే..!

|
Google Oneindia TeluguNews

భారత్ కాలుష్యపు కోరల్లో చిక్కుకుపోతోందని చెబుతూ మరో నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యం కలిగిన నగరాలను 30 ఎంపిక చేయగా అందులో 21 నగరాలు భారత్‌లోనే ఉన్నట్లు ఐక్యూ ఎయిర్ విజువల్స్‌ 2019 వరల్డ్ ఎయిర్‌ క్వాలిటీ పేరుతో విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇందులో టాప్‌టెన్ నగరాల్లో ఆరు నగరాలు భారత్‌కు చెందినవి ఉండటం విశేషం.

Recommended Video

World's 30 Most Polluted Cities : 21 Indian Cities, Ghaziabad Tops List | Oneindia Telugu
టాప్ ప్లేస్‌లో ఘజియాబాద్

టాప్ ప్లేస్‌లో ఘజియాబాద్

ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘజియాబాద్ నగరం అత్యంత కాలుష్య నగరంగా అగ్రస్థానంలో నిలిచింది. 2019లో సగటు ఎయిర్‌ క్వాలిటీ 110.2గా రికార్డ్ అయ్యింది. అమెరికా పర్యావరణ సంరక్షణ బోర్డు సూచించే పరిమితి కాలుష్య రేటు కన్నా రెట్టింపు ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక గతేడాది నవంబర్‌లో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ 800 రికార్డు అయిన సందర్భంలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఐక్యూ ఎయిర్ విజువల్స్ సంస్థ చేపట్టిన సర్వేలో 2.5 మైక్రోమీటర్ల సైజులో ఉన్న పార్టికల్స్ అత్యంత ప్రమాదంగా మారుతున్నాయని వెల్లడించింది. ఇవి ఊపిరితిత్తుల్లోకి సులభంగా ప్రవేశిస్తాయని తద్వారా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయని నివేదిక వెల్లడించింది.

వాయు కాలుష్యంతో కడుపులోనే పిల్లలు మృతి

వాయు కాలుష్యంతో కడుపులోనే పిల్లలు మృతి


ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం గాల్లోని కాలుష్యంతో ప్రపంచ వ్యాప్తంగా ఏటా 7 మిలియన్ మంది పిల్లలు కడుపులోనే మృతి చెందుతున్నారని వెల్లడించింది. ముఖ్యంగా ఈ అతి సూక్ష్మమైన కాలుష్య పదార్థాలు ఊపిరితిత్తులు, గుండె వంటి ప్రాంతాలను తాకడంతో పుట్టకముందే బిడ్డ మృతి చెందుతున్నారని వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న 80శాతం మంది కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. 2018 నుంచి 2019 వరకు చూసుకుంటే కాలుష్యంతో నిండిన నగరాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇందుకు కారణం వాతావరణం అనుకూలించడం, కాలుష్యం లేకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్లే సాధ్యమైందని నివేదిక వెల్లడించింది.

నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంకు శ్రీకారం

నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంకు శ్రీకారం

ఉదాహరణకు ఘజియాబాద్‌లో ఈ ఏడాది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 110.2గా నమోదైంది. అందే 2019లో ఇది 135.2 గాఉండగా 2017లో 144.6గా నమోదైంది. ఇక కాలుష్యంపై పోరుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంను ప్రారంభించింది. 2024కల్లా 102 నగరాల్లో 20 నుంచి 30 శాతం కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం పనిచేస్తోంది. గ్రీన్ హౌజ్ వాయువుల విడుదల కాలుష్యానికి ప్రధాన కారణంగా నిలుస్తోందని నివేదిక వెల్లడించింది. ఇప్పటికీ చాలా దేశాలు ఎనర్జీ ఉత్పత్తి కోసం బొగ్గుమీదే ఆధారపడుతున్నాయని నివేదిక వెల్లడించింది. ఇక చైనాలో మొత్తంగా చూసుకుంటే 2018 నుంచి 2019 వరకు 9 శాతం కాలుష్యం తగ్గినట్లు నివేదిక స్పష్టం చేసింది.

English summary
India has once again topped an annual list of cities with the worst air quality in the world, according to a new report, while Chinese cities have continued to show improvements from the previous year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X