వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దయ్యాలనే అమ్మేశాడు: కటకటాలపాలయ్యాడు

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్: గ్రామీణ ప్రజల మూఢనమ్మకాలను ఆసరా చేసుకుని ఓ వ్యక్తి మోసాలకు పాల్పడ్డాడు. అలాంటి ఇలాంటి మోసం కాదు, ఏకంగా దయ్యాలనే వారికి అమ్మేశాడు. ఆ తర్వాత మోసపోయామని గ్రహించిన కొందరు.. పోలీసులను ఆశ్రయించడంతో ఈ కొత్త రకం మోసం వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. ఛత్తీగఢ్‌లోని జష్‌పూర్ ప్రాంతంలో సర్కోబ్ గ్రామస్తులు దయ్యలున్నాయని నమ్మతారు. వారి ఈ నమ్మకాన్నే తన పెట్టుబడిగా వ్యాపారం ప్రారంభించాడు నారాయణ్ యాదవ్ అనే వ్యక్తి.

Ghost smugglers: Why men and women buy and sell ghosts in this village

తన దగ్గర దయ్యాలు ఉన్నాయని, వాటిని కొనుక్కుంటే అదృష్టం కలిసి వస్తుందని పేర్కొంటూ వ్యాపారం వృద్ధి చేసుకున్నాడు. దయ్యాలు కనపడవు కనుక నిరూపించాల్సిన అవసరం లేదు. దయ్యాలే లేవు, నీదంతా బూటకపు వ్యాపారం అని ఎవరైనా నిలదీస్తే కనుక, దయ్యాలున్న విషయం హనుమాన్ ఛాలీసాలో ఉంది చూసుకోండని వారికి చెబుతాడు.

గ్రామస్తుల అవసరాలు కనిపెట్టి, వారిని భయపెట్టి, ఇలా లేని దయ్యాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు.

కాగా, ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో అవాక్కైన పోలీసులు, నిజంగా దయ్యాలను అమ్ముతున్నాడని నిర్ధారించుకున్న తర్వాత.. నారాయణ్ యాదవ్, అతని ఇద్దరు అనుచరులను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.

English summary
Fully aware that he is surrounded by blind followers of superstitious practices, a man in Jashpur's Sarkobo village thought of a unique way to use it to his benefit - selling ghosts to mint money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X