వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్‌లో ఆజాద్‌కు మరోసారి చుక్కెదురు.. ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్న పోలీసులు

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్ : కశ్మీర్‌లో పరిస్థితి సద్దుమణగలేదు. విపక్ష నేతలంతా ఇంకా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. ఈ క్రమంలో కశ్మీర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ... సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు ప్రయత్నించి చతికిలబడ్డారు. ఆయనను విమానాశ్రయంలోనే అధికారులు అడ్డగించారు. పార్టీ ఆఫీసుకు వెళ్లానని చెప్పినా .. వినిపించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక ఆయన ఢిల్లీకి తిరుగుపయనమయ్యారు.

కశ్మీర్‌లో గులాంనబీ ఆజాద్‌కు మరోసాకి చుక్కెదురైంది. ఇవాళ మధ్యాహ్నం కశ్మీర్ వెళ్లిన ఆయనను పోలీసులు ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఇంకా చాలా చోట్ల ఆంక్షలు కొనసాగుతున్నందున .. ఆజాద్ వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. తన ఇంటికి వెళ్లానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. పార్టీ కార్యాలయానికి వెళ్లి తిరిగి వస్తానని చెప్పినా అనుమతించలేదు.

Ghulam Nabi Azad can’t enter J&K, sent back this time from Jammu airport

జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దులో కశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. 40 వేల పోలీసు బలగాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ నేతలను ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. కశ్మీర్ మాజీ సీఎంలు మెహబూబ ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఈ క్రమంలో కశ్మీర్ వెళ్లేందుకు ప్రయత్నించి మరోసారి విఫలమయ్యారు ఆజాద్. ఎయిర్ పోర్టులో అడ్డుకోవడం సరికాదని మీడియాతో మాట్లాడారు ఆజాద్. ప్రజాస్వామ్యంలో ఇది సరికాదని అభిప్రాయపడక్డారు. రాజకీయ పార్టీల నేతలను కశ్మీర్‌లోకి వెళ్లనీయకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మరి ఎవరినీ రాష్ట్రంలోకి రానిస్తారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలు అసహనానికి ప్రతీక అని విమర్శించారు.

English summary
Leader of Opposition in the Rajya Sabha, Ghulam Nabi Azad who was stopped at Jammu Airport on Tuesday afternoon for nearly two hours before he was sent back to Delhi at 4.10 pm, described his face off with the local administration as a sign of intolerance. “It’s not right for democracy. If mainstream political parties won’t visit, then who will go? Three former CMs J&K are already under house arrest and one former CM of J&K not being allowed to enter the state, it is a sign of intolerance,” ANI quoted Azad as saying.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X