
viral video:వామ్మో,, రెప్పపాటులో దూసుకొచ్చిన పాము.. ఎగిరి గంతేసిన యువతి..
అసలే వేసవి.. ఆపై ఉక్కపోత.. దీంతో కాస్త సమయం దొరికితే చాలు బయట ఉండడానికి జనం ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవును చల్లగాలికి గడిపేందుకు ఇష్టపడతారు. సో అలా ఉండే సమయంలో జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాములు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఓ పాము వచ్చింది. దీంతో సదరు యువతి ఎగిరి గంతేసింది. వీడియో కూడా భయానకంగానే ఉంది.

రెప్పపాటులో వచ్చిన పాము
ఓ యువతి బయట ఉంది. ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు.. కానీ కనిపించడం లేదు. ఆమె సిగ సెట్ చేసుకుంటుంది. ఇంతలో ఓ పాము వచ్చింది. దీంతో ఆ యువతి ఎగిరి గంతేసింది. ఇంతలో ఒకరు ఏమైంది అనడం వీడియోలో వినిపిస్తోంది. ఏం కాలేదు అని.. ఆ యువతి లోనికి వచ్చింది. అయితే పారుకుంటూ వచ్చిన పాము వేగంగా వెళ్లిపోయి ఉంటుంది. హాల్ లో గల సోఫా వద్దకు ఆమె వచ్చిన.. ఆ వీడియోలో అయితే పాము కనిపించలేదు.

ఆహారం కోసం.. కానీ ఇళ్లలోకి
వేసవి కావడంతో ఆహారం కోసం సరీసృపాలు బయటకు వస్తుంటాయి. అలా ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తున్నాయి. కానీ పాములు అంటే అందరికీ భయమే.. ఎవరి ఇంటిలోకి అయినా పాము వస్తే పరిస్థితి భయానకంగా ఉంటుంది. ఇటీవల జరిగిన ఘటన వైరల్ అయ్యింది. ఆ వీడియో ఇన్ స్టలో పోస్ట్ చేశారు. కొందరు షేర్ చేయడంతో వైరల్ అయయింది. దానిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ఫేక్ వీడియో
ఆ వీడియోపై ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు. అదీ ఫేక్ అని కొందరు రాస్తున్నారు. ఆ వీడియోలో పాము ఎలా కనిపించకుండా పోయిందని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో చూడటంతో తాను డోర్ తెరవద్దు అనుకున్నానని పేర్కొన్నారు. మరొకరు ఆహారం, ఉండటానికి చోటు కోసం సరీసృపాలు వస్తుంటాయని రాస్తున్నారు. ఆ వీడియో తలా ఒక కామెంట్ చేస్తున్నారు. అయితే అందులో ఉన్న యువతీ మాత్రం భయాందోళనకు గురయ్యింది. తర్వాత పాము కనిపించకపోవడం అనే విషయంపై క్లారిటీ లేదు. దీంతో సందేహాలు రావొచ్చు.. కానీ పాము రాలేదని అనడం సరికాదని అనేవారు కొందరు ఉన్నారు.