బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కల్బుర్గి గతే: చంపేస్తామంటూ కర్నాడ్‌కు బెదిరింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: చంపేస్తామంటూ ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్‌కు బెదిరింపులు వచ్చాయి. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని డిమాండ్ చేసినందుకు ఆయను చంపేస్తామంటూ హెచ్చరికలు చేశారు.

హిందువులను, వొక్కలింగ వర్గాన్ని అవమానిస్తూ సామాజిక సామరస్యాన్ని దెబ్బ తీస్తున్నారంటూ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. మంగళవారంనాడు టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా గిరీష్ కర్నాడ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఈ వేడుకలను నిరసిస్తూ ప్రదర్శనలు జరిగాయి. వాటిలో కొన్ని హింసాత్మకంగా మారి, పోలీసు కాల్పుల్లో ఓ విహెచ్‌పి కార్యకర్త మరణించాడు.

Girish Karnad

తన వ్యాఖ్యలతో వివాదం చెలరేగడంతో జ్ఝానపీఠ అవార్డు గ్రహీత కూడా అయిన గిరీష్ కర్నాడ్ క్షమాపణలు చెప్పారు. ఎవరైనా తన వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడితే క్షమాపణలు చెబుతున్నానని, అలా చెప్పడం వల్ల తనకేం వస్తుందని ఆయన అన్నారు.

ఇన్‌ టోలరెంట్ చంద్ర అనే యూజర్ నేమ్‌తో ట్విట్టర్‌లో గిరీష్ కర్నాడ్‌ను హెచ్చరిస్తూ పోస్టింగ్ వచ్చిందని, దీనిపై ఏమైనా ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. కల్బుర్గికి పట్టిన గతే నీకు పడుతుందంటూ గిరీష్ కర్నాడ్‌కు బెదిరింపులు వచ్చాయి.

English summary
Playwright Girish Karnad has been threatened he would meet the same end as murdered writer MM Kalburgi for demanding renaming of the Kempegowda International airport after Tipu Sultan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X