వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైసూర్ దసరా ఉత్సవాలపై తొలగిన అనిశ్చితి(పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మైసూర్ దసరా ఉత్సవాలకు పెట్టింది పేరు. యావత్ ప్రపంచం నలుమూలల నుండి ఈ ఉత్సవాలను వీక్షించేందుకు వస్తుంటారు. మైసూర్ మహారాజు శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడెయరు హఠాన్మరణం తర్వాత రాజవంశానికి వారసుడిని ఇంతవరకు ఎంపిక చేయని విషయం తెలిసిందే.

ఈ నేపధ్యంలో దసరా ఉత్సవాల సంప్రదాయానికి ఆటంకం కలుగుతుందేమోనని అందరూ భావించారు. సాంప్రదాయానికి భంగం వాటిల్లకుండా మైసూరులో రాజసింహాసనంపై ఖడ్గం ఉంచి గురువారం ప్రైవేట్ దర్బార్ నిర్వహించారు.

అంతకమందు ఉదయం ప్యాలెస్‌లో ఒడెయరు సోదరి తనయుడు చదురంగ కాంతరాజ అరసు సాంప్రదాయ రాజదుస్తుల్ని ధరించి ఖడ్గాన్ని సింహాసనంపై ఉంచారు. ఆ తర్వాత మహారాణి ప్రమోదాదేవి సింహాసనం, ఖడ్గానికి పూజలు నిర్వహించారు.

దీంతో విశ్యవిఖ్యాత మైసూర్ దసరా ఉత్సవాలు గురవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత గిరీష్ కర్నాడ్ చాముండేశ్వరి అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి 404వ మైసూర్ దసరా ఉత్సవాలను ప్రారంభించారు.

ఈ సందర్బంలో గిరీష్ కర్నాడ్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల్ని ప్రారంభించే అదృష్టం రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా పాల్గోన్నారు.

 ప్రారంభమైన మైసూర్ దసరా ఉత్సవాలు

ప్రారంభమైన మైసూర్ దసరా ఉత్సవాలు

ప్రైవేట్ దర్బార్‌ని రాజసింహాసనంపై ఉంచిన ఖడ్గానికి పూలమాల వేస్తున్న మైసూర్ మహారాణి ప్రమోదా దేవి.

 ప్రారంభమైన మైసూర్ దసరా ఉత్సవాలు

ప్రారంభమైన మైసూర్ దసరా ఉత్సవాలు

మైసూర్ దసరా ఉత్సవాల సందర్బంగా అర్జున అనే ఏనుగు చెక్క అంబారీని మోసుకొస్తున్న దృశ్యం. దీని బరువు బంగారు అంబారీతో సమానంగా ఉంటుంది.

 ప్రారంభమైన మైసూర్ దసరా ఉత్సవాలు

ప్రారంభమైన మైసూర్ దసరా ఉత్సవాలు

మైసూర్ దసరా ఉత్సవాల సందర్బంగా అర్జున అనే ఏనుగు చెక్క అంబారీని మోసుకొస్తున్న దృశ్యం. దీని బరువు బంగారు అంబారీతో సమానంగా ఉంటుంది.

 ప్రారంభమైన మైసూర్ దసరా ఉత్సవాలు

ప్రారంభమైన మైసూర్ దసరా ఉత్సవాలు

లాల్ బాగ్ గార్డెన్‌లో సంవత్సర ప్లవర్ షో 2014లో మైసూర్ మహారాజ ప్యాలెస్ నమూనాను ఆసక్తిగా తిలకిస్తున్న స్కూల్ విద్యార్దులు.

 ప్రారంభమైన మైసూర్ దసరా ఉత్సవాలు

ప్రారంభమైన మైసూర్ దసరా ఉత్సవాలు

మెరుపులు మెరియడంతో ఆ మెరుపుల కాంతుల్లో మైసూర్ మహారాజా ప్యాలెస్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న దృశ్యం.

ప్రారంభమైన మైసూర్ దసరా ఉత్సవాలు

ప్రారంభమైన మైసూర్ దసరా ఉత్సవాలు


మెరుపులు మెరియడంతో ఆ మెరుపుల కాంతుల్లో మైసూర్ మహారాజా ప్యాలెస్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న దృశ్యం.

English summary
The 10-day long Mysore Dasara festivities got off to a traditional start atop the Chamundi hills with special prayers to Goddess Chamundeshwari, the presiding deity of Mysore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X