• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లవ్ పేరుతో దగ్గరై సెక్స్ వీడియోలు - ఏడుగురు అమ్మాయిలకు నరకం - వ్యాపారి అకృత్యాలపై సిట్ ఏర్పాటు

|

బ్రాండెడ్ దుస్తులు.. స్టైల్ మెయింటెనెన్స్.. అవసరం ఉందని ఎవరొచ్చినా కాదనకుండా సహాయం చేసే తత్వం.. అబ్బో.. మనోడి పోజులు మామూలుగా ఉండేవికావు. ఊళ్లో పేరుమోసిన వడ్డీ వ్యాపారిగా చెలామణి అయ్యాడు.. రాష్ట్రంలోని బడా రాజకీయ నేతల పేర్లతో వీఐసీ సుఖాలూ పొందిన ఆ వ్యక్తి అసలు బాగోతం ఆలస్యంగా బయటపడింది. ఏళ్లుగా కొనసాగుతోన్న అతని అకృత్యాలను ఓ 16 ఏళ్ల అమ్మాయి బయటపెట్టింది. దీనిపై రాజకీయంగానూ దుమారం చెలరేగింది. మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లాలో చోటుచేసుకున్న ఈ వ్యవహారానికి సంబంధించి ఎస్పీ రియాజ్ ఇక్బాల్ చెప్పిన వివరాలివి..

కరోనాపై చైనా మరో సంచలన ప్రకటన-గత ఏప్రిల్‌లోనే వ్యాక్సిన్ రెడీ-అందరికీ వద్దు -సైడ్ ఎఫెక్ట్స్: సీడీసీ

ఏడుగురిపై అత్యాచారం..

ఏడుగురిపై అత్యాచారం..

సాత్నా జిల్లా కేంద్రానికి చెందిన మొహ్మద్ అతీఖ్ మన్సూరి(40) అనే వ్యాపారిని గత శనివారం పోలీసులు అరెస్టు చేశారు. గడిచిన కొన్నేళ్లుగా అతను మొత్తం ఏడుగురు మహిళల్ని అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. డబ్బు ఆశ చూపించి కొందరిని, ప్రేమ పేరుతో ఇంకొదరిని అతను లొంగదీసుకున్నాడని, ఒక్కసారి మహిళలకు దగ్గరైన తర్వాత శృంగార కలాపాలను రహస్యంగా వీడియో తీసి, వాటిని అడ్డం పెట్టుకుని బాధితులను బ్లాక్ మెయిల్ చేసేవాడని, వాళ్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి.. ఆ మొత్తాన్నీ వడ్డీలకు తిప్పేవాడని బయటపడింది. జాబితాలో చివరి బాధితురాలు ధైర్యం చేయడంతో అతని లీలలు బయటపడ్డాయిలా..

అందరికీ వ్యాక్సిన్: 2024 తర్వాతే - సీరం సీఈవో అధర్ అనూహ్య వ్యాఖ్యలు

16 ఏళ్ల అమ్మాయిపై రెండేళ్లుగా..

16 ఏళ్ల అమ్మాయిపై రెండేళ్లుగా..

వ్యాపారి అతీఖ్ మన్సూరి.. గతంలో మారు పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ తెరిచి, 16 ఏళ్ల అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. మాయమాటు చెప్పి ఆమెపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని, వీడియోలు వైరల్ చేస్తానని బెదిరిస్తూ రెండేళ్లుగా ఆమెకు నరకం చూపించాడు. అతని చర్యలతో విసిగిపోయిన అమ్మాయి ఎట్టకేలకు ధైర్యం చేసి కొల్గావాన్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. గత శనివారం అతణ్ని అదుపులోకి తీసుకోగా.. పోలీసులకు విచారణలో దిగ్భ్రాంతికర విషయాలెన్నో బయటపడ్డాయి..

వీఐసీ ట్రీట్మెంట్- సిట్ ఏర్పాటు..

వీఐసీ ట్రీట్మెంట్- సిట్ ఏర్పాటు..

వ్యాపారిగా చెలామణీ అవుతోన్న అతీఖ్ మన్సూరి.. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలకు చెందిన లెటర్ హెడ్స్ ను ఫోర్జరీ చేసి, వాటి ద్వారా వీఐసీ కోటాలో ప్రయాణాలు, గెస్ట్ హౌజుల్లో గడపడం లాంటివి చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. మన్సూరి ఇంటి నుంచి సదరు నకిలీ లెటర్ హెడ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. 16 ఏళ్ల అమ్మాయిపై రెండేళ్లుగా అత్యాచారం, బెదిరింపులకు పాల్పడటం, మరో ఆరుగురు మహిళలపై కూడా ఇదే తరహాలో నేరాలకు పాల్పడటం, వీఐసీ లెటర్ హెడ్స్ వెలుగులోకి రావడం.. వెరసి ఈ కేసు తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసినట్లు సాత్నా జిల్లా ఎస్పీ రియాజ్ ఇక్బాల్ తెలిపారు.

  Onion Exports బ్యాన్ : ఉల్లి ఎగుమతులపై నిషేధం | ధరల పెరుగుదల, కొరత నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం !
  లవ్ జీహాద్‌లో భాగమేనన్న బీజేపీ

  లవ్ జీహాద్‌లో భాగమేనన్న బీజేపీ

  మన్సూరీ బాధిత జాబితాలోని ఏడుగురు మహిళల్లో ఒకరిని అతను పెళ్లి కూడా చేసుకుని, కొంతకాలానికి వదిలేశాడని వెల్లడైంది. సదరు మహిళను మతం మార్చేసి, 2017లో ఆమెకు విడాకులు ఇచ్చేసి, ఆ తర్వాత కూడా వీడియోలతో బెదిరింపులకు దిగేవాడని దర్యాప్తులో తేలింది. సాత్నా జిల్లాలో కలకలం రేపిన ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మ సైతం స్పందించారు. ఇది ముమ్మాటికీ లవ్ జీహాద్ వ్యవహారమేనని, సాత్నా ఘటనపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సీరియస్ గా ఉన్నారని, నిందితుణ్ని కఠినంగా శిక్షించేదాకా బీజేపీ ఊరుకోబోదని శర్మ అన్నారు. అయితే, పోలీసులు మాత్రం ‘లవ్ జీహాద్' కోణాన్ని కొట్టిపారేశారు.

  English summary
  A 40-year-old businessman has been arrested in Madhya Pradesh’s Satna district on a charge of raping and blackmailing a 16-year-old girl. Police said the accused had been blackmailing six more women. The girl had come forward to file a police complaint on Friday last (September 11). Satna superintendent of police Riyaz Iqbal said the 16-year-old told the Kolgawan police in the district that a man, who had introduced himself as Sameer to her, had been raping her for the past two years. He had threatened her if she reported the crime and blackmailed her.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X