• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Girl: కాలేజ్ అమ్మాయి దారుణ హత్య, ఆమె ఇంట్లో శవమైన యువకుడు, పేరు కూడా తెలీదు, ఏం జరిగింది !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బంధువులు అందరూ ఒకే ఏరియాలో ఉండటంతో ఆరు నెలల క్రితం దంపతులు ఆ ప్రాంతంలో కొత్తగా ఇంటిని నిర్మించుకుని అక్కడికి కాపురం మార్చారు. పీయూసీ పూర్తి చేసిన దంపతుల కూతురు ఇటీవల బి ఫార్మసీ కాలేజ్ లో చేరింది. ఎప్పటిలాగే దంపతులు ఇద్దరూ వారి పనులు మీద వారు బయటకు వెళ్లారు. కాలేజీకి వెళ్లకుండా కూతురు ఇంట్లోనే ఉంది. మద్యాహ్నం తండ్రి ఇంటిలో భోజనం చెయ్యడానికి వెళ్లాడు. ఆ సమయంలో కూతురు దారుణ హత్యకు గురి కావడం, పక్కనే ఓ యువకుడు ఉరి వేసుకున్న విషయం గుర్తించిన తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న స్థానికులు, సమీపంలో నివాసం ఉంటున్న బంధువులు అక్కడికి పరుగు తీశారు.

యువతిని కత్తితో పొడిచి దారుణంగా చంపేసిన తరువాత యువకుడు ఉరి వేసుకున్నాడని అనుమానాలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు. అయితే పోలీసులకు ఇంకో అనుమానం కూడా ఉంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో తమ కూతురు వేరే యువకుడిని ఇంటికి పిలిపించుకుని ఏకాంతంగా గడుపుతోందని గుర్తించి అమ్మాయి కుటుంబ సభ్యులు పరువు హత్యలకు పాల్పడ్డారా ? అనే అనుమానాలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు. యువతి ఇంట్లో శవమై కనింపించిన యువకుడి పేరు, వివరాలు గుర్తించడానికి వీలుకాకపోవడంతో కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

MLA love story: ఉద్యోగం, పెళ్లి చేసుకుంటానని ఎమ్మెల్యే రేప్ చేశాడు, కేసు పెట్టిన ఆంటీ, కూతురు !MLA love story: ఉద్యోగం, పెళ్లి చేసుకుంటానని ఎమ్మెల్యే రేప్ చేశాడు, కేసు పెట్టిన ఆంటీ, కూతురు !

 బెంగళూరు శివార్లలో !

బెంగళూరు శివార్లలో !

బెంగళూరు నగర శివార్లలోని మాగడిలో దోడ్డయ్య, గంగమ్మ దంపతులు నివాసం ఉండేవారు. దోడ్డయ్య, గంగమ్మ దంపతుల బంధులు చాలా మంది బెంగళూరు గ్రామీణ జిల్లాలోని ఆనేకల్ సమీపంలోని జిగణిలోని నిసర్గ లేఔట్ లో నివాసం ఉంటున్నారు. బంధువులతో కలిసి ఉండాలని ఆశతో దోడ్డయ్య నిసర్గ లేఔట్ లో ఇంటి స్థలం తీసిపెట్టాడు.

 ఆరు నెలల క్రితం కొత్త ఇంట్లో కాపురం పెట్టారు

ఆరు నెలల క్రితం కొత్త ఇంట్లో కాపురం పెట్టారు

దోడ్డయ్య, గంగమ్మ దంపతులకు సించనా (19) అనే కుమార్తె ఉంది. బంధువులు అందరూ జిగణిలో ఒకే ఏరియాలో ఉండటంతో ఆరు నెలల క్రితం దోడ్డయ్య, గంగమ్మ దంపతులు నిసర్గ లేఔట్ లో కొత్తగా ఇంటిని నిర్మించుకుని మాగడి నుంచి అక్కడికి కాపురం మార్చారు. ఆరు నెలల నుంచి దోడ్డయ్య, గంగమ్మ దంపతులు, వారి కుమార్తె సించనా అక్కడే సంతోషంగా కాపురం ఉంటున్నారు.

 కాలేజ్ కు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న అమ్మాయి

కాలేజ్ కు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న అమ్మాయి

పీయూసీ పూర్తి చేసిన దోడ్డయ్య, గంగమ్మ దంపతుల కూతురు సించనా ఇటీవల బెంగళూరులోని సెయింట్ జాన్స్ కాలేజ్ లో బి ఫార్మసీలో చేరింది. ఎప్పటిలాగే దోడ్డయ్య, గంగమ్మ దంపతులు ఇద్దరూ వారి పనులు మీద వారు బయటకు వెళ్లారు. కాలేజీకి వెళ్లకుండా దంపతుల కూతురు సించనా ఆమె ఇంట్లోనే ఉంది. ఈ రోజులు కాలేజ్ లేదని సించనా ఆమె తల్లిదండ్రులకు చెప్పింది.

 రూమ్ లో కూతురి హత్య..... హాల్ లో ఫ్యాన్ కు వేలాడుతున్న యువకుడు

రూమ్ లో కూతురి హత్య..... హాల్ లో ఫ్యాన్ కు వేలాడుతున్న యువకుడు

మద్యాహ్నం సించనా తండ్రి దోడ్డయ్య ఇంటిలో భోజనం చెయ్యడానికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో అడుగు పెట్టిన దోడ్డయ్య హడలిపోయాడు. కూతురు సించనా దారుణ హత్యకు గురి కావడం, పక్కనే ఓ యువకుడు ఉరి వేసుకున్న విషయం గుర్తించిన ఆమె తండ్రి దోడ్డయ్య ఆనేకల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న స్థానికులు, సమీపంలో నివాసం ఉంటున్న బంధువులు దోడ్డయ్య ఇంటి దగ్గరకు పరుగు తీశారు.

 యువకుడి పేరు, ఊరు తెలీదు

యువకుడి పేరు, ఊరు తెలీదు

సించనాను కత్తితో పొడిచి. ఆమె గొంతు కోసి దారుణంగా చంపేసిన తరువాత యువకుడు ఉరి వేసుకున్నాడని అనుమానాలు ఉన్నాయని ఆనేకల్ పోలీసులు అంటున్నారు. అయితే పోలీసులకు ఇంకో అనుమానం కూడా ఉంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో తమ కూతురు సించనా వేరే యువకుడిని ఇంటికి పిలిపించుకుని ఏకాంతంగా గడుపుతోందని గుర్తించి అమ్మాయి కుటుంబ సభ్యులు పరువు హత్యలకు పాల్పడ్డారా ? అనే అనుమానాలు ఉన్నాయని ఆనేకల్ పోలీసులు అంటున్నారు.

 యువతి మొబైల్ ఫోన్ లో !

యువతి మొబైల్ ఫోన్ లో !

సించనా ఇంట్లో హత్యకు గురైన యువకుడి వివరాలు మాత్రం చిక్కలేదని పోలీసులు అంటున్నారు. సించనా మొబైల్ ఫోన్ పరిశీలించినా ఆ యువకుడు ఆచూకి మాత్రం చిక్కడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. సించనా ఇంట్లో శవమై కనింపించిన యువకుడి పేరు, వివరాలు గుర్తించడానికి వీలుకాకపోవడంతో కేసు విచారణ చేస్తున్న ఆనేకల్ పోలీసు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సంఘటనా స్థలంలో ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు, వేలిముద్రల నిపుణులు పరిశీలించి వివరాలు సేకరించారు. సించనాతో పాటు యువకుడి శవాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
Girl: College girl found murdered and boyfriend found hanged at Jigani near Bengaluru City outskirts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X