వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెట్టుకు కట్టేసి ప్రియుడి ఎదుటే ప్రేయసిపై గ్యాంగ్‌రేప్

|
Google Oneindia TeluguNews

Girl gang-raped in front of lover
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలిలో దారుణం జరిగింది. ప్రియుడి కళ్లేదుటే తన ప్రియురాలిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కన్యాకుమారి జిల్లాలోని తిట్టువిలై ప్రాంతానికి కంప్యూటర్ ఇంజీనర్ అరివాల్, తిరునల్వేలి జిల్లాలో కంప్యూటర్ సేల్స్, సర్వీస్ చేస్తుంటాడు. అలివార్ నాగర్ కోయిల్ ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. ఆ యువతికి కూడా ఇతడ్ని ప్రేమిస్తోంది.

ఈ నేపథ్యంలో శనివారం అలివార్ తన ప్రేయసితో కలిసి బైక్‌పై వివిధ ప్రాంతాలను సందర్శించి సాయంత్రం తమ ఊరికి బయలుదేరారు. ఈ జంట ఒంటరిగా వెళ్లడం గమనించిన ముగ్గురు వ్యక్తులు వారిని వెంబడించి నాంగునేరి కళక్కాడు రోడ్డులో జియ్యర్‌కుళం దగ్గర వారిని అడ్డుకున్నారు.

ఆ తర్వాత అలివార్‌ను నిర్మానుష్య ప్రదేశంలోని ఓ చెట్టుకు కట్టేసి అతని ప్రియురాలిపై ఆ ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అలివార్ దగ్గర ఉన్న ల్యాప్‌టాప్, రెండు ఫోన్లను తీసుకున్న దుండుగులు అక్కడ్నుంచి పరారయ్యారు. అరివాల్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బాధిత యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రి తరలించారు.

English summary
In another heinous incident that happened in Tirunalveli, three reprobates gang-raped a girl in front of her lover.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X