Girl: ఆడుకుంటున్న 8 ఏళ్ల అమ్మాయిని పిలుచుకెళ్లి సామూహిక అత్యాచారం, హత్య, నలుగురు !
మంగళూరు/ బెంగళూరు: పొట్టకూటి కోసం దంపతులు వారి పిల్లలతో కలిసి వలస వచ్చి ఫ్యాక్టరీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఫ్యాక్టరీ ఆవరణంలోనే పిల్లలతో కలిసి దంపతులు నివాసం ఉంటున్నారు. దంపతుల 8 సంవత్సరాల కుమార్తె ఇంటి ముందు ఆడుకుంటున్నది. ఫ్యాక్టరీలో పని చేస్తున్న కొందరు కామాంధులు 8 ఏళ్ల అమ్మాయి మీద కన్ను వేశారు. ఇంటి ముందు ఆడుకుంటున్న అమ్మాయికి తినడానికి చాక్లెట్లు తీసిస్తామని చెప్పి పిలుచుకుని వెళ్లారు. అమ్మాయి మీద సామూహిక అత్యాచారం చెయ్యడంతో బాధలు తట్లుకోలేక అమ్మాయి కేకలు వేసింది. బాలికకు ఎక్కువగా రక్తం పోవడం, కేకలు వేయడంతో ఆమె గొంతు నులిమి చంపేసిన నిందితులు శవాన్ని డ్రైనేజ్ లో విసిరేసి చేతులు దులుపుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి అనుమానితులను అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే విషయం మొత్తం బయటకు వచ్చింది.
Illegal
affair:
నలుగురు
భర్తలు,
ఇద్దరు
ప్రియులు,
గురువుతో
వెళ్లి
వస్తూ
ఆంటీతో
?,
ఫినిష్
!

వలస వచ్చిన దంపతులు
జార్ఖండ్ కు చెందిన దంపతులు కర్ణాటకలోని మంగళూరుకి పొట్టకూటి కోసం వలస వచ్చారు. దంపతులు వారి పిల్లలతో కలిసి వలస వచ్చి మంగళూరు సమీపంలోని టైల్స్ ఫ్యాక్టరీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళూరులో అద్దె ఇంటిలో నివాసం ఉండటానికి స్తోమతలేకపోవడంతో టైల్స్ ఫ్యాక్టరీ ఆవరణంలోనే పిల్లలతో కలిసి ఆ దంపతులు నివాసం ఉంటున్నారు.

ఇంటి ముందు ఆడుకుంటున్న అమ్మాయి
దంపతుల 8 సంవత్సరాల కుమార్తె ఇంటి ముందు ప్రతిరోజూ ఆడుకుంటున్నది. ఫ్యాక్టరీలో పని చేస్తున్న కొందరు కామాంధులు 8 ఏళ్ల అమ్మాయి మీద కన్ను వేశారు. మార్తె ఇంటి ముందు ఆడుకుంటున్నది. ఫ్యాక్టరీలో పని చేస్తున్న నలుగురు కామాంధులు 8 ఏళ్ల అమ్మాయి మీద కన్ను వేశారు. ఈనెల 21వ తేదీన ఆదివారం ఇంటి ముందు ఆడుకుంటున్న అమ్మాయికి తినడానికి చాక్లెట్లు తీసిస్తామని చెప్పి పిలుచుకుని వెళ్లారు.

సామూహిక అత్యాచారం చేసి చంపేసిన కామాంధులు
ఫ్యాక్టరీ ఆవరణంలోనే అమ్మాయి మీద ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చెయ్యడంతో బాధలు తట్లుకోలేక అమ్మాయి కేకలు వేసింది. బాలికకు ఎక్కువగా రక్తం పోవడం, కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వస్తారనే భయంతో ఆమె గొంతు నులిమి చంపేసిన నిందితులు శవాన్ని డ్రైనేజ్ లో విసిరేసి చేతులు దులుపుకుని సాక్షాలు మొత్తం నాశనం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సెలవు కావడంతో పట్టుకోలేరని ?
సాయంత్రం వరకు అమ్మాయి కనపడకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, పక్కన నివాసం ఉంటున్న వారు అమ్మాయి కోసం గాలించారు. డ్రైనేజ్ సమీపంలోని డ్రైనేజ్ లో బాలిక శవమై కనిపించింది. ఇంటి ముందు ఆడుకుంటున్న కూతురు రక్తపు గాయాలతో శవమై కనిపించడంతో బాలిక తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.

బెండ్ తీస్తే మ్యాటర్ బయటకు వచ్చింది
విషయం తెలుసుకున్న మంగళూరు పోలీసులు రంగంలోకి దిగారు. టైల్స్ ఫ్యాక్టరీలో మొత్తం 30 మంది పని చేస్తున్నారు. అమ్మాయి హత్యకు గురైన రోజు ఆదివారం కావడంతో 19 మంది మాత్రమే పని చేశారని పోలీసులు గుర్తించారు. 11 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే విషయం మొత్తం బయటకు వచ్చింది.

కామాంధులు అరెస్టు
మధ్యప్రదేశ్ కు చెందిన ముగ్గురు, జార్ఖండ్ కు చెందిన ఓ కామాంధుడు బాలిక మీద సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని అంగీకరించారని, నలుగురిని అరెస్టు చేశామని బుధవారం మంగళూరు జిల్లా ఎస్పీ ఎన్. శివకుమార్ మీడియాకు చెప్పారు. పొట్టకూటి కోసం వచ్చిన దంపతుల కూతురు సామూహిక అత్యాచారానికి గురై దారుణ హత్యకు గురి కావడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది.