బాలికపై తొమ్మిది నెలలుగా రేప్, లిఫ్ట్ ఇస్తామని చత్తీస్‌గఢ్‌లో
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో పదమూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి తొమ్మిది నెలలుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చిన ఘాతుకం ఆదివారం నాడు వెలుగులోకి వచ్చింది. ఇదే ప్రాంతానికి చెందిన ఇరవై ఆరేళ్ల భండోళా బాలికను కిడ్నాప్ చేసి మహారాష్ట్రలోని సంగోళ జిల్లా ఇస్లాంపుర గ్రామ పరిధిలోని ఒక ఇంట్లో దాచాడు.
తొమ్మిది నెలలుగా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు తప్పిపోయిన విషయమై ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి, దర్యాప్తు చేశారు.
కొంతకాలంగా వభండోళా లేకపోవడంతో ఆ కోణంలో దర్యాప్తు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు మహారాష్ట్రకు వెళ్లి బాలికను దుండగుడి చెరనుంచి రక్షించి ఆసుపత్రికి తరలించారు. సదాశివను అదుపులోకి తీసుకున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో..
చత్తీస్‌గఢ్‌లోని జవ్‌పూర్ జిల్లాలో ఏడుగురు యువకులు 17 ఏళ్ల గిరిజన బాలికను కిడ్నాప్ చేసి తొమ్మిది రోజుల పాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఆరుగురిని ఆదివారం జశ్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ జిఎస్ దూబే ఫోన్‌లో పిటిఐకి తెలిపారు.
తప్కారా ప్రాంతానికి చెందిన బాధితురాలు ఈ నెల 18న జశ్‌పూర్ శివార్లలోని తన పిన్ని ఇంటికి వెళ్తుండగా కిడ్నాప్‌కు గురయింది. బాలిక నడిచి వెళ్తుండగా రెండు మోటారు బైక్‌లపై వచ్చిన నలుగురు ఆమెను ఆపి లిఫ్ట్ ఇస్తామని చెప్పారు. అందుకు ఆమె నిరాకరించడంతో బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని దగ్గర్లోని పర్యాటక కేంద్రం దమేరాకు తీసుకువెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
మరో ముగ్గురు స్నేహితులు కూడా దారిలో వారితో కలిసారు. ఆ తర్వాత తొమ్మిది రోజుల పాటు ఆ అమ్మాయితో ఆ ప్రాంతంలోని వివిధ పర్యాటక ప్రాంతాల్లో తిరుగుతూ పదే పదే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 28న ఆమెను పట్టణంలోని ఓ స్టేడియం వద్ద వదిలిపెట్టి, విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆరుగురిని అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications