బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పిన ప్రియురాలు, మంచి ఉద్యోగాలు వస్తే, ప్రియుడు ఏం చేశాడంటే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇంత త్వరగా పెళ్లి వద్దని, విద్యాభ్యాసం పూర్తి చేసి మంచి ఉద్యోగాలు వచ్చిన తరువాత పెళ్లి చేసుకుందామని ప్రియురాలు చెప్పడంతో ప్రియుడు సహనం కొల్పోయాడు. పెళ్లికి అడ్డు చెబుతున్న ప్రియురాలి గొంతు నులిమి ఆమెను హత్య చెయ్యడానికి ప్రయత్నించిన ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జరిగింది.

తుమకూరు జిల్లా శిరా తాలుకా మదలూరుకు చెందిన మహావీర్ భక్త గురునానక్ (24) అనే యువకుడు 23 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నాడు. మహావీర్, అతని ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. యువతి చిత్రదుర్గలో బీఎస్సీ నర్సింగ్ విద్యాభ్యాసం చేస్తున్నది.

 Girl refused to early marriage boy tried to kill her in Karnataka

రెండు రోజుల క్రితం తనను వివాహం చేసుకోవాలని మహావీర్ ప్రియురాలికి చెప్పాడు. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేస్తానని, నీకు విద్యాభ్యాసం పూర్తి అయ్యే వరకు వేచి చూద్దామని, ఇద్దరికి మంచి ఉద్యోగాలు వచ్చిన తరువాత పెళ్లి చేసుకుందామని మహావీర్ కు అతని ప్రియురాలు చెప్పింది.

అయితే పెళ్లి త్వరగా చేసుకోవాలని మహావీర్ ప్రియురాలి మీద ఒత్తిడి చేశాడు. అప్పుడే పెళ్లి చేసుకోవడానికి ప్రియురాలు నిరాకరించింది. ఈ విషయంలో సహనం కోల్పోయిన మహావీర్ ప్రియురాలిని మదలూరు గ్రామం దగ్గరకు తీసుకెళ్లి ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఆమె మీద ఒత్తిడి చేశాడు.

పెళ్లికి నిరాకరించిన ప్రియురాలి గొంతు నులిమాడు. గట్టిగా గొంతు నులమడంతో ప్రియురాలు సృహ కొల్పోయింది. ప్రియురాలు మరణించిందని భావించిన మహావీర్ అక్కడి నుంచి పరారైనాడు. కొన్ని గంటల తరువాత సృహలోకి వచ్చిన యువతి స్థానికుల సహాయంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.

యువతిని ఆమె కుటుంబ సభ్యులు తుమకూరులోని ఆసుపత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరులోని నిమ్హాన్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రియురాలిని హత్య చెయ్యడానికి ప్రయత్నించిన మహావీర్ పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
Girl Refused to Get Early Marriage she wants to take some time to decide, Her Boyfriend Tried to Kill her in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X