వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేరెంట్స్ షాక్: ప్రియుడి కల నెరవేర్చేందుకు సొంతింట్లో రూ.1కోటి దొంగిలించిన అమ్మాయి

|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్థాన్‌లోని రాజ్‌కోట్‌లో ఓ ప్రియురాలు తన ప్రియుడి కోసం తన సొంతింట్లోనే భారీ దొంగతనం చేసిన సంఘటన చోటు చేసుకుంది. ప్రేమ కోసం ఏమైనా చేస్తామనే వాళ్లు ఎందరో ఉంటారు. అయితే ఈ అమ్మాయి ప్రియుడి కోసం తన ఇంట్లోనే దొంగతనం చేసి పట్టుబడింది. దీంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.

<strong>షాకింగ్: బ్యాంక్‌లోని ఓ మేనేజర్ రూ.84 లక్షల చిల్లర దొంగ, అసలు ఎలా తీసుకెళ్లాడో?</strong>షాకింగ్: బ్యాంక్‌లోని ఓ మేనేజర్ రూ.84 లక్షల చిల్లర దొంగ, అసలు ఎలా తీసుకెళ్లాడో?

ఆమె పేరు ప్రియాంక ప్రసన్న. వయస్సు ఇరవై ఏళ్లు. ప్రియాంక తండ్రి పేరు కిషోర్. అతను వ్యాపారవేత్త. ఆమె ప్రియుడి పేరు హెట్ షా. అతని వయస్సు కూడా 20 ఏళ్లే. హేట్ షా కమర్షియల్ పైలట్ ట్రెయినింగ్ తీసుకుంటున్నాడు. ఈ డబ్బుల కోసమే ఆమె తన ఇంట్లోనే దొంగతనం చేసింది.

దోపిడీ జరిగిందని నమ్మించే ప్రయత్నం

దోపిడీ జరిగిందని నమ్మించే ప్రయత్నం

ఆమె తన ఇంట్లో నుంచి దాదాపు రూ.1 కోటి విలువైన బంగారు, వెండి నగలు, నగదు దొంగిలించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేశారు. 17 రోజుల్లో కేసు ముగించారు. ప్రియాంక బాయ్ ఫ్రెండ్ నుంచి వాటిని రికవరీ చేశారు. ప్రియుడిని పైలట్‌ చేసేందుకు ఆ అమ్మాయి తన సొంతింటికే కన్నం వేసిందని గుర్తించి అందరూ అవాక్కయ్యారు. ఆమె ఇంట్లో నుంచి వాటిని ఎత్తుకెళ్లడంతో పాటు దోపిడీ జరిగిందని ఆధారంగా ఇంట్లో చిందరవందరగా చేసేసింది. పోలీసులు ఈ కేసును తెలివిగా ఛేదించారు. సొంత కూతురే దొంగ అని తెలియడంతో కుటుంబ సభ్యులు షాకయ్యారు.

ప్రియుడికి సాయం చేసేందుకు

ప్రియుడికి సాయం చేసేందుకు

రాజ్ కోట్‌లో ధనవంతులుండే గీతాంజలి పార్క్‌ ప్రాంతంలో ప్రియాంక (20), గీత్‌ గుర్జారి సొసైటీలో ఉండే హెట్ షా (20) గత రెండు ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఛార్టెడ్‌‌ అకౌంటెంట్లు కావాలన్నది వీరి ధ్యేయం. ట్యూషన్‌ క్లాస్‌లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ప్రియుడు హెట్ షా కమర్షియల్‌ పైలట్‌ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ట్రెయినింగ్ అకాడమీ బెంగళూరులో ఉంది. ఇందుకు డబ్బులు కావాలి. అందుకే అతడికి సాయం చేసేందుకు 3 కిలోల బంగారు నగలు, రెండు కిలోల వెండి నగలు, రూ.64,000 నగదును కప్ బోర్డులోంచి దొంగిలించింది ప్రియాంక. ఇవి కోటికి పైగా విలువ చేస్తాయి.

దోపిడీ జరిగిందని నమ్మించేందుకు

దోపిడీ జరిగిందని నమ్మించేందుకు

ఇంటి నుంచి తాను ఎత్తుకెళ్లినట్లు ఎవరికీ అనుమానం రావొద్దని ప్రియాంక ప్లాన్ చేసింది. ఇంట్లోని వస్తువులను నాశనం చేసింది. నవంబర్ 29న ప్రియాంక తల్లి, సోదరి పెళ్లి కోసం బయటకు వెళ్లారు. ఆ సమయంలో దొంగతనానికి పాల్పడింది. ఇంట్లో దొంగతనం జరిగిందని భావించిన ప్రియాంక తండ్రి కిషోర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నవంబర్‌ 29 మధ్యాహ్నం ప్రియాంక దోపిడీ చేసింది. ఆ తర్వాత దాదాపు గంట సేపటికి భోజనం కోసం తండ్రి వచ్చాడు. పరిస్థితి గమనించి పోలీసులను సంప్రదించాడు.

ప్రియాంకను ప్రశ్నించిన పోలీసులు

ప్రియాంకను ప్రశ్నించిన పోలీసులు

డిసెంబర్ 1వ తేదీన తల్లి తిరిగి వచ్చింది. కబోర్డును చూసిన తర్వాత నగలు, నగదు మాయమయ్యాని కూడా చెప్పింది. దోపిడీ బీభ్సతంగా లేకపోవడం, నకిలీ తాళం చెవి ఉపయోగించినట్టు పోలీసులకు అనుమానం వచ్చింది. పలు కోణాల్లో విచారణలో భాగంగా ప్రియాంకను ప్రశ్నించారు. తనకు ఏం తెలియదని చెప్పింది. దీంతో ఆమె గతం తవ్వారు. ప్రేమలో ఉన్న విషయాన్ని గమనించి ప్రియుడు హెట్‌ షా కోసం వెళ్లారు. అతడు బెంగళూరు ఉన్నాడు. దీంతో అక్కడకు వెళ్లి విచారణ జరిపారు.

నిజం తెలిసి షాకయ్యారు

నిజం తెలిసి షాకయ్యారు

ఈ విచారణలో పోలీసులకు నిజం తెలిసింది. అతనికి డబ్బు రావడం వెనుక ఆరా తీయడంతో వాస్తవం వెలుగు చూసింది. కూతురే దొంగతనం చేసిందని తెలిసి తల్లిదండ్రులు షాకయ్యారు. వారి మనసు బాధపడింది. ఇక చేసేదేం లేక ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ప్రియాంక శ్రీమంతుల బిడ్డ కాగా ప్రియుడు హెట్‌ షా తండ్రి ఓ సిరామిక్‌ తయారీ సంస్థలో ఉద్యోగి. పైలట్ శిక్షణకు కావాల్సిన రుసుము రూ.20 లక్షలు. కానీ ఆమెకు వాటి విలువ, అదేం తెలియక రూ.1 కోటి దొంగిలించింది.

English summary
In an unusual turn of events in a case of burglary at a Rajkot businessman's house, the police have revealed that the man's daughter was responsible for the alleged crime. Kishor Parsana, the businessman in question, had reached out to the police over a robbery of Rs 1 crore at his house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X