వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాకరాని చోట తాకుతూ!: బస్సులోనే కండక్టర్ చెంప చెల్లుమనిపించిన యువతి..

కటక్ నగరంలో పని ముగించుకుని భవనేశ్వర్ కు తిరిగి వస్తుండగా.. ఓ ఉద్యోగినికి ఈ చేదు అనుభవం ఎదురైంది. ఎంతసేపు నిరీక్షించినా.. ఒక్క ఖాళీ బస్సు రాకపోవడంతో.. తీరా రద్దీగా ఉన్న బస్సులోనే ఎక్కేసింది.

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: సిటీ బస్సులో ప్రయాణం ఎంత నరకంగా ఉంటుందో.. ఒకసారి అనుభవిస్తే తప్ప తెలియదు. ఉదయాన్నే ఫ్రెష్ గా తయారై ఆఫీసుకని బయలుదేరే వ్యక్తి.. సిటీ బస్సు పుణ్యమాని.. తన స్టాప్ లో దిగేసరికి కుదేలైపోతాడు. చింపిరి జుట్టు, చెమటలు పట్టిన ముఖం, వేసుకున్న టక్ ఊడిపోయి, పాదాలు పచ్చడి కింద నలిగిపోయి.. ఇలా సిటీ బస్సు ప్రయాణికుల అవస్థల లిస్టు ఇంతకన్నా పెద్దగానే ఉంటుంది.

ఇక అదే ఆడవాళ్ల పరిస్థితి అయితే మరింత ఘోరం. అసలే రద్దీతో ఊపిరి కూడా ఆడుతుందో లేదో అన్నట్లు బిగదీసుకుని నిల్చుంటే.. ఇదే సంధు అనుకుని అసభ్యంగా ప్రవర్తించే మగవాళ్లకు కొదువ లేదు. తాజాగా ఒడిశాలోని కటక్ సిటీ బస్సులో ఓ కండక్టర్ ఇలాగే అసభ్యకరంగా ప్రవర్తించాడు. కానీ అందరూ ఒకలా ఉండరు కదా!.. చిర్రెత్తుకుపోయిన ఓ యువతి.. అతగాడి చెంప చెళ్లమనిపించింది.

Girl slaps conductor of bus for obscenity

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కాస్త జంటన నగరాల పోలీస్ కమిషనర్ వై.బి. ఖురానియా దృష్టికి వెళ్లడంతో అతనిపై చర్యలకు సిద్దమవుతున్నారు పోలీసులు. రాష్ట్రంలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

కాగా, కటక్ నగరంలో పని ముగించుకుని భవనేశ్వర్ కు తిరిగి వస్తుండగా.. ఓ ఉద్యోగినికి ఈ చేదు అనుభవం ఎదురైంది. ఎంతసేపు నిరీక్షించినా.. ఒక్క ఖాళీ బస్సు రాకపోవడంతో.. తీరా రద్దీగా ఉన్న బస్సులోనే ఎక్కేసింది. అయితే ప్రయాణికులను అడ్జస్ట్ చేస్తున్నట్లు అటు ఇటు తిరుగుతున్న కండక్టర్.. ఈ క్రమంలో వారిని అసభ్యంగా తాకడం ఆమె గమనించింది. తన పట్ల కూడా అలాగే వ్యవహరించడంతో.. చెంప చెళ్లమనిపించి బుద్ది చెప్పింది. ఈ నెల 18న ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

English summary
An Odisha girl slapped a bus conductor for “inappropriately” touching her and some other girls as they were returning from Cuttack to Bhubaneswar on Sunday, in the pretext of making way for other passengers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X