యువతిపై ఐదుగురి గ్యాంగ్ రేప్... కత్తిపోట్లు... కేసులో అనూహ్య ట్విస్ట్... రివర్స్ కేసు నమోదు...
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సిటీలో దారుణం వెలుగుచూసింది. గ్యాంగ్ రేప్‌కి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ యువతి... ఇందుకోసం పెద్ద కట్టు కథ అల్లింది. అంతేకాదు,పోలీసులను నమ్మించడం కోసం తనను తాను కత్తితో పొడుచుకుని... నిందితుల దాడిలో గాయపడినట్లు చెప్పింది. అయితే పోలీసుల విచారణలో ఆమెవి నిరాధార ఆరోపణలని తేలింది. ఆ యువతి ఎందుకిలా తప్పుడు కేసు పెట్టాలనుకున్నది ఇంకా తెలియరాలేదు.

ఐదుగురు గ్యాంగ్ రేప్ చేశారని...
పోలీసుల కథనం ప్రకారం... మంగళవారం(జనవరి 18) ఇండోర్‌కు చెందిన 19 ఏళ్ల యువతి తనను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని... ఆపై మరో ముగ్గురితో కలిసి తనపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుండగులు తనను కత్తితో పొడిచి గాయపరిచారని చెప్పింది. ఆపై ఓ గోనె సంచిలో తనను కుక్కి రైల్వే ట్రాక్‌పై పడేశారని పేర్కొంది. ఆ సంచి నుంచి ఎలాగోలా బయటపడి... స్థానికుల సహాయంతో ఇండోర్‌లోని ఎంవై ఆస్పత్రికి చేరినట్లు తెలిపింది.

అంతా కట్టు కథే...
ఈ ఘటనపై ఇండోర్ ఐజీ హరినారాయణ్ చారి మిశ్రా మాట్లాడుతూ... యువతి చెప్పిన వివరాల ఆధారంగా రైల్వే ట్రాక్ ప్రాంతంలోని సీసీటీవి ఫుటేజీ సహా దాదాపు 150 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించినట్లు తెలిపారు. కానీ ఎక్కడా ఆ యువతి చెప్పిన వివరాలకు ఆధారాలు దొరకలేదన్నారు. ఆ యువతి పూర్తిగా కట్టు కథ అల్లినట్లు తమ విచారణలో తేలిందన్నారు. తనకు తానే కత్తితో పొడుచుకుని మరీ దుండగులు గాయపర్చారని చెప్పిందన్నారు.

యువతి పైనే కేసు నమోదు...
ఎవరైతే తనపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారని ఆ యువతి ఫిర్యాదు చేసిందో.. అందులో ఒకరితో ఆమెకు గతంలో ప్రేమ వ్యవహారం ఉందన్నారు. వారిద్దరూ ఒకే ప్రాంతంలో ఉంటారని చెప్పారు.అయితే ఆమె ఎందుకిలా తప్పుడు కేసు పెట్టాలనుకుందో ఇంకా తెలియరాలేదన్నారు. తప్పుడు ఫిర్యాదుతో పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు ఆమెపై 182/211 కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.

మరో ఘటనలో అత్యాచార బాధితురాలి ఆత్మహత్య...
ఇదే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మరో దారుణం జరిగింది. 17 ఏళ్ల ఓ అత్యాచార బాధితురాలు బుధవారం(జనవరి 20) రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. షెల్టర్ హోమ్‌లో రక్షణ పొందుతున్న సమయంలో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. షెల్టర్ హోమ్ అధికారుల వేధింపులే తమ కుమార్తెను బలితీసుకున్నాయని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు,ఆమెపై వారు లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కనీసం తమ బిడ్డ మృతదేహాన్ని కూడా ఇంటికి తీసుకెళ్లనివ్వలేదని... ఆస్పత్రి నుంచి నేరుగా స్మశానానికి తరలించి అంత్యక్రియలు జరిపించారని వాపోయారు. ఈ ఘటనపై భోపాల్ జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.