వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోచింగ్ సెంటర్‌కు దిమ్మదిరిగే షాకిచ్చిన యువతి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: తమ కోచింగ్ సెంటర్లో చేరితో బాగా మార్కులు వస్తాయని కోటింగ్ సెంటర్లు ప్రకటనలు గుప్పిస్తుంటాయి. అలాంటి ఓ కోచింగ్ సెంటర్‌కు ముంబైకి చెందిన ఓ యువతి దిమ్మదిరిగే సమాధానం చెప్పింది. ముంబై విద్యార్థిని ఓ ప్రయివేటు కోచింగ్ సెంటర్ పైన రూ.3 లక్షలకు కేసు వేసింది.

అభివ్యక్తి వర్మ అనే విద్యార్థిని హెచ్ఎస్సీ పరీక్షలకు సిద్దమవుతున్నాడు. మ్యాథ్స్, కెమిస్ట్రీ ట్యూషన్ కోసం 2013లో అందేరీలోని ఆక్స్‌ఫర్డ్ ట్యూటర్స్ అకాడమీ కోచింగ్ సెంటరుకు వెళ్లింది. తమ దగ్గర అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఉందని వారు చెప్పడంతో హోం ట్యూషన్ పెట్టించుకుంది.

ఫీజు చెల్లించి నెల గడిచినా కెమిస్ట్రీ టీచర్‌ను పంపించలేదు. మ్యాథ్స్ టీచర్‌కు హిందీలో తప్ప ఇంగ్లీషులో చెప్పడం రాదు. విద్యార్థిని చాలాసార్లు వీటి గురించి నిలదీసింది. సరిగా పాఠాలు చెప్పలేదు.

 Girl Sues Coaching Class For Low HSC Score, Wins Rs 3 Lakh

ఒత్తిడికి, గందరగోళానికి గురైన ఆమె టెన్త్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధఇంచలేకపోయింది. ఆమె తల్లి నీనా మాట్లాడుతూ.. తమ కుమార్తెకు కాలేజీ సీటు రావడం కష్టమైందని, దీంతో గత ఏడాది ఆక్స్‌ఫర్డ్ ట్యూటర్స్ అకాడమీపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశామని చెప్పారు.

ఇరు పక్షాల వాదనలు విన్న ఫోరం గత నెలలో తీర్పు వెలువరించింది. విద్యార్థినికి జరిగిన నష్టానికి రూ.3.64 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఆమె కట్టిన ఫీజు రూ.54,000 తిరిగివ్వాలని, మానసికంగా వేధించినందుకు రూ.3 లక్షలు, కోర్టు ఫీజుల కింద రూ.10వేలు కట్టాలని చెప్పింది.

English summary
Here's a lesson on consumer rights. An Andheri-based tutoring centre has been slapped with a fine of Rs. 3.64 lakh by the consumer court for failing to provide promised services to a Std XII student in 2013.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X