వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు: శారీరకంగా హింసించారంటోన్న న్యాయ విద్యార్థిని

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి స్వామి చిన్మయానంద్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. స్వామి చిన్మయానంద్ తనపై తరచూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఓ న్యాయ విద్యార్థిని ఆరోపణలు చేశారు. దీనిపై ఆయన తన ఫేస్ బుక్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన ఆ విద్యార్థిని ఆచూకీ తెలియరాకుండా పోవడం ప్రస్తుతం ప్రకంపనలు పుట్టిస్తోంది. స్వామి చిన్మయానంద్ తమ కుమార్తెను మాయం చేసి ఉంటారని బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. చిన్మయానంద్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

<strong>విశాఖలో పిల్లుల కోసం కూడా రెక్కీ : గొర్రెమాంసం పేరుతో హోటళ్లకు విక్రయం</strong>విశాఖలో పిల్లుల కోసం కూడా రెక్కీ : గొర్రెమాంసం పేరుతో హోటళ్లకు విక్రయం

ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో స్వామి సుఖదేవానంద న్యాయ కళాశాలలో బాధిత విద్యార్థిని చివరి సంవత్సరం చదువుతున్నారు. అదే కళాాశాలకు చెందిన హాస్టల్ లో ఉంటున్నారు. స్వామి చిన్మయానంద్ ఇదే కళాశాలకు డైెరెక్టర్ గా కొనసాగుతున్నారు. చిన్మయానంద్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, తరచూ శారీరకంగా హింసిస్తున్నారని, దీన్ని వీడియో తీసి బెదిరిస్తున్నారని, తనను రక్షించాలని కోరుతూ బాధిత విద్యార్థిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లకు విన్నవించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆమె ఈ నెల 23వ తేదీన తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె కనిపించకుండా పోయారు.

Girl who accused Swami Chinmayanand of threatening her goes missing

నాలుగురోజులుగా తమ కుమార్తె కనిపించట్లేదని అంటూ బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరిసారిగా రక్షాబంధన్ నాడు తమ కుమార్తె ఎస్ఎస్ కళాశాల హాస్టల్ నుంచి ఇంటికి వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ముభావంగా ఉన్నట్లు గుర్తించామని అన్నారు. అనంతరం కళాశాలకు వెళ్లిన తమ కుమార్తె ఇప్పటిదాకా కనిపించట్లేదని చెప్పారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు చిన్మయానంద్ పై కేసు నమోదు చేశారు. కాగా- అశ్లీల వీడియోలను అడ్డుగా పెట్టుకుని బాధితురాలి తల్లిదండ్రులు తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అయిదు కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తున్నారని ఎస్ఎస్ కళాశాల యాజమాన్యం ఆరోపించింది. బాధిత విద్మార్థిని తల్లిదండ్రులపై యాజమాన్యం కేసు పెట్టింది.

Girl who accused Swami Chinmayanand of threatening her goes missing
English summary
A female law student from SS Law College in Uttar Pradesh’s Shahjahanpur has been missing from her college hostel since she accused politician and college director Swami Chinmayanand of exploitation. The girl posted a video on her Facebook account in which she can be heard saying, “A big leader of the saint society, who has destroyed the lives of several girls, has been threatening me with life.” She was allegedly speaking about Chinmayanand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X