వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయిన యువతి... ఇప్పుడు కాబోయే ఆఫీసర్....

|
Google Oneindia TeluguNews

ఆడపిల్లలకు చదువు ఎందుకన్న మూర్ఖపు ఆలోచన ఇప్పటికీ చాలామంది మెదళ్ల నుంచి తొలగట్లేదు. పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెట్టి చేతులు దులుపుకోవాలన్న ఆలోచనే తప్ప... ఆమె కలలు,ఆకాంక్షలకు విలువ లేదు. ఫలితంగా మగపిల్లలతో సమానంగా విద్య,ఉద్యోగాలను పొందడంలో ఆడపిల్లలు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. అయినప్పటికీ... ఆ వివక్షను,అవమానాలను జయించి మరీ సత్తా చాటుతున్న ఆడపిల్లలకు కూడా కొదువ లేదు. సంజు రాణి వర్మ కూడా ఇదే కోవలోకి వస్తుంది.

ఎవరా యువతి...

ఎవరా యువతి...

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కి చెందిన సంజు రాణి వర్మ(35) 2013లో డిగ్రీ పూర్తి చేసి ఢిల్లీ యూనివర్సిటీలో పీజీ కోర్సులో చేరింది. కానీ అదే ఏడాది అనారోగ్యంతో ఆమె తల్లి చనిపోవడంతో కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఇక చదువు మానేసి పెళ్లి చేసుకోమని సంజు వర్మపై కుటుంబం ఒత్తిడి తెచ్చింది. కానీ సంజు వర్మకు ఉన్నత చదువులు చదవాలన్న కోరిక బలంగా ఉండేది. ఒకవైపు కుటుంబ సభ్యుల ఒత్తిడి... మరోవైపు ఒంటరిగా ఏమీ చేయలేని నిస్సహాయత... అయినా సరే,పరిస్థితులను సంజు సవాల్‌గా తీసుకుంది. ఒత్తిడికి తలొగ్గక తన చదువు కొనసాగించేందుకే నిర్ణయించుకుంది.

చేతిలో చిల్లి గవ్వ లేక...

చేతిలో చిల్లి గవ్వ లేక...

ఇంట్లో ఉంటే తాను ఉన్నత చదువులు చదవడం సాధ్యపడదు కాబట్టి... ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటిని వదిలిపెట్టింది. ఎవరికీ చెప్పా పెట్టకుండా ఢిల్లీ పారిపోయింది. అయితే చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో సంజు వర్మ చాలా కష్టాలే పడింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ ఏడాది పీజీ చదువును కొనసాగించలేకపోయింది. అయినా సరే చదువుపై తన కోరికను చంపుకోలేదు. ట్యూషన్లు చెబుతూ... ప్రైవేట్ స్కూళ్లలో టీచింగ్ చేస్తూ.. క్రమంగా కొంత డబ్బు కూడబెట్టుకుంది.ఆ డబ్బుతో తన పీజీ చదువును కొనసాగిస్తూ సివిల్స్‌కు ప్రిపేర్ అయింది.

సత్తా చాటిన సంజు

సత్తా చాటిన సంజు


సంజు వర్మ కష్టం వృథా కాలేదు. ఇటీవల వెలువడ్డ యూపీపీఎస్సీ-2018 ఫలితాల్లో ఆమె సత్తా చాటింది. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ఆమెకు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇల్లు వదిలిన ఏడేళ్ల తర్వాత కాబోయే ఆఫీసర్ హోదాలో ఆమె తిరిగి తన కుటుంబ సభ్యులను కలుసుకుంది. ఒకప్పుడు సంజు చదువుకు అడ్డు చెప్పిన కుటుంబ సభ్యులే... ఇప్పుడు ఆమె ప్రతిభకు సంతోషపడుతున్నారు.

సంజు మాటల్లో...

సంజు మాటల్లో...

'మా అమ్మ చనిపోయాక పెళ్లి చేసుకోవాలని కుటుంబమంతా నాపై విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ నాకు చదువుకోవాలనుందని చెప్పాను. ఎన్నో విధాలుగా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. కానీ నావన్నీ వృథా ప్రయత్నాలే అయ్యాయి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇల్లు వదిలి సొంతంగా బతకాలని నిర్ణయించుకున్నాను. అనుకున్నట్లుగానే కష్టపడి చదివి ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఎంపికయ్యాను.' అని సంజు వర్మ చెప్పుకొచ్చారు.

English summary
It was the toughest period of her life back in 2013. The pressure was mounting on her to get married and settle down after her mother's death. However, Sanju Rani Verma was restless to achieve her dreams. And finally, that moment arrived when she cracked the Uttar Pradesh Provincial Civil Services (UP PCS) exam 2018, the result of which came last week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X