Girlfriend: ప్రియుడితో కలిసి విషం తాగి కాలేజ్ అమ్మాయి ఆత్మహత్య, కొబ్బరి తోటలో ?, ఆ విషయంలో ?
చెన్నై/సేలం: ఓ యువకుడు వ్యాపారం చేస్తున్నాడు. యువకుడు నివాసం ఉంటున్న ఊరిలోనే నివాసం ఉంటున్న అమ్మాయి కాలేజ్ లో చదువుతోంది. యువతి, యువకుడు ప్రేమించుకున్నాడు. డబ్బు సంపాధిస్తున్న ప్రియుడు అతని ప్రియురాలితో సంతోషంగా తిరిగాడు. ప్రేమికులు సినిమాలు, షికార్లు తిరిగారు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ప్రియుడు అతని ప్రియురాలి కుటుంబ సభ్యులకు మనవి చేశాడు. అయితే మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చెయ్యడం కుదరదని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. తోటలో ప్రియుడితో ఏకాంతంగా కలుసుకుని కొన్ని గంటలపాటు అక్కడే గడిపిన కాలేజ్ అమ్మాయి ఆమె బాయ్ ఫ్రెండ్ తో కలసి విషం సేవించి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

కాలేజ్ అమ్మాయి
తమిళనాడులోని సేలం జిల్లాలోని మెట్టూరు సమీపంలో నంగవల్లి గ్రామంలో గోపి (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. గోపి మెట్టూరులో బట్టల వ్యాపారం చేస్తున్నాడు, నంగవలి గ్రామంలోనే 17 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది. ఆ యువతి మెట్టూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది.

సంతోషంగా ఎంజాయ్ చేసిన ప్రేమికులు
కాలేజ్ లో చదువుతున్న అమ్మాయికి, గోపికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది, గోపి, కాలేజ్ అమ్మాయిల కులాలు ఒకటే. రెండు సంవత్సరాల క్రితం గోపి, కాలేజ్ అమ్మాయి ప్రేమలోపడ్డారు. అప్పటి నుంచి ప్రేమికులు రోజు కలుసుకుంటున్నారు. గోపి అతని ప్రియురాలిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తున్నాడు. సాయంత్రం మళ్లీ ఆమెను ఇంటికి పిలుచుకుని వస్తున్నాడు.

ఇప్పుడే పెళ్లి చెయ్యడం కుదరదు
డబ్బు సంపాధిస్తున్న ప్రియుడు అతని ప్రియురాలితో సంతోషంగా తిరిగాడు. ప్రేమికులు సినిమాలు, షికార్లు తిరిగారు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని గోపి అతని ప్రియురాలి కుటుంబ సభ్యులకు మనవి చేశాడు. అయితే మా అమ్మాయికి ఇంకా 18 సంవత్సరాలు నిండలేదని, ఈ వయసులో ఆమెను నీకు ఇచ్చి పెళ్లి చెయ్యడం కుదరదని అన్నారు.

నెగటివ్ గా ఆలోచించిన ప్రేమికులు ?
కాలేజ్ చదువు పూర్తి అయిన తరువాత మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చెయ్యాలా ? వద్దా ? అని ఆలోచిస్తామని ఆమె కుటుంబ సభ్యులు గోపికి చెప్పారు. తన ప్రియురాలి కుటుంబ సభ్యులు తనతో ఆమె పెళ్లి చెయ్యడానికి అంగీకరించరని గోపి ఆవేదన చెందాడు. ఇదే విషయంలో కొంతకాలంగా ప్రేమికులు నెగటివ్ గా ఆలోచించడం మొదలుపెట్టారు.

కొబ్బరి తోటలో విషం మాత్రలు ?
సాయంత్రం కొబ్బరి తోటలో ప్రియుడు గోపితో ఏకాంతంగా కలుసుకుని కొన్ని గంటలపాటు అక్కడే గడిపిన కాలేజ్ అమ్మాయి తరువాత ప్రియుడు గోపితో కలసి చెట్లకు వేసే అల్యూమినియం ఫాస్పేట్ మాత్రలులు మింగేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన గోపి, అతని గర్ల్ ఫ్రెండ్ ను సేలంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

బలవంతంగా చంపేశాడు ?
చికిత్స విఫలమై గోపి, అతని ప్రియురాలి ప్రాణాలో పోయాయని పోలీసులు అన్నారు. బాయ్ ఫ్రెండ్ తో కలసి కాలేజ్ అమ్మాయి విషం మాత్రలు మిగేసి ఆత్మహత్య చేసుకోవడం సేలం జిల్లాలో కలకలం రేపింది. ఇంటర్ పూర్తి అయిన తరువాత పెళ్లి చేస్తామని చెప్పినా మా అమ్మాయితో గోపి బలవంతంగా విషం మాత్రలు మిగించి చంపేశాడని కాలేజ్ అమ్మాయి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications