Girlfriend: గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో దూరి ఏటీఎం కార్డుతో గొంతు కోసుకున్న బాయ్ ఫ్రెండ్, మ్యాటర్ !
చెన్నై: సిటీలో తల్లీ కూతురు మాత్రమే నివాసం ఉంటున్నారు. కూతురు మంచి ఉద్యోగం చేస్తుండటంతో తల్లి చిన్నపాటి ఉద్యోగం చేసేది. గత ఏడాది తల్లి ఉద్యోగం మానేసి ఇంటి దగ్గరే ఉంటున్నది. కూతురు పని మీద బయటకు వెళ్లింది. ఆ సమయంలో ఓ యువకుడు వారి ఇంటిలో చొరబడ్డాడు. ఎంతసేపటికి కూతురి బెడ్ రూమ్ లోకి వెళ్లిన యువకుడు బయటకు రాకపోవడంతో తల్లి వెళ్లి అతన్ని బయటకు రావాలని చెప్పింది. అయినా ఆ యువకుడు రూమ్ లో నుంచి బయటకు రాకపోవడంతో ఆమె చుట్టుపక్కల వారి సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వెళ్లి తలుపులు కొట్టినా అతను మాత్రం బయటకు రాలేదు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా ఆ యువకుడు రక్తపుమడుగులో పడి ఉన్న విషయం గుర్తించి అందరూ షాక్ అయ్యారు. రూమ్ లో ఎలాంటి కత్తి చిక్కలేదు. కూతురి ఏటీఎం కార్డుతో ఆ యువకుడు గొంతు కోసుకున్నాడని గుర్తించిన పోలీసులు హడలిపోయారు. ఆంటీ కూతురు, గొంతు కోసుకున్న యువకుడు గతంలో ఒకే కాలేజ్ లో చదువుకున్నారని, వీరి మద్య లక్షల రూపాయల ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని వెలుగు చూడటంతో స్థానికులు హడలిపోయారు.
Actress: రోడ్డు పక్కన శవమైన ఫేమస్ నటి, భర్త, కారు డ్రైవర్ అరెస్టు, ఇంటి నుంచి వెళ్లి మాయం, చివరికి !

తల్లీ కూతురు నివాసం
చెన్నై సిటీలోని పెరవళ్లూరు ఏరియాలో మేరీ (53) అనే మహిళ నివాసం ఉంటున్నది. మేరీ, ఆమె కుమార్తె చైత్రా (పేరు మార్చడం జరింది) అనే యువతి మాత్రమే ఆ ఇంటిలో నివాసం ఉంటున్నారు. కూతురు చైత్రా మంచి ఉద్యోగం చేస్తుండటంతో ఆమె తల్లి మేరీ చిన్నపాటి ఉద్యోగం చేసేది. గత ఏడాది మేరీ ఉద్యోగం మానేసి ఇంటి దగ్గరే ఉంటున్నది.

కతూరికి బాయ్ ఫ్రెండ్
పుదుచ్చేరికి చెందిన అరవిందన్ అలియాస్ అరవింద్ (25) అనే యువకుడికి, మేరీ కూతురు చైత్రాకు పరిచయం ఉంది. మేరీ ఇంట్లో లేని సమయంలో అరవిందన్ చైత్రా ఇంటికి వెళ్లి ఆమెను కలిసి వెళ్లేవాడని తెలిసింది. అయితే ఇంతకాలం మేరీ ఉన్న సమయంలో అరవిందన్ ఒక్కసారి కూడా ఆ ఇంటిలోకి వెళ్లలేదని సమాచారం.

బెడ్ రూమ్ లోకి దూరిన యువకుడు
బుధవారం ఉదయం మేరీ కూతురు చైత్రా పని మీద బయటకు వెళ్లింది. ఆ సమయంలో మేరీ మాత్రమే ఇంట్లో ఉంది. ఆ సమమయంలో అరవిందన్ మేరీ ఇంటిలో చొరబడ్డాడు. చైత్రా బెడ్ రూమ్ లోకి వెళ్లిన అరవిందన్ లోపల డోర్ లాక్ చేసుకున్నాడు. ఎంతసేపటికి కూతురు చైత్రా బెడ్ రూమ్ లోకి వెళ్లిన యువకుడు బయటకు రాకపోవడంతో ఆమె తల్లి మేరీ వెళ్లి అతన్ని బయటకు రావాలని చెప్పింది.

పోలీసులు వచ్చేలోపు గొంతు కోసుకున్న యువకుడు
మేరీ ఎంతపిలిచినా అరవిందన్ బెడ్ రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో మేరీ చుట్టుపక్కల వారి సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వెళ్లి తలుపులు కొట్టినా అరవిందన్ మాత్రం రూమ్ లో నుంచి బయటకు రాలేదు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా అరవిందన్ రక్తపుమడుగులో పడి ఉన్న విషయం గుర్తించి అందరూ షాక్ అయ్యారు.

ఏటీఎం కార్డుతో ఆత్మహత్యాయత్నం ?
మేరీ కూతురి రూమ్ లో ఎలాంటి కత్తి చిక్కలేదు. మేరీ కూతురి ఏటీఎం కార్డుతో అరవిందన్ గొంతు, చేతి మణికట్టు కోసుకున్నాడని గుర్తించిన పోలీసులు హడలిపోయారు. వెంటనే అరవింద్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మేరీ కూతురు, గొంతు కోసుకున్న యువకుడు అరవిందన్ గతంలో చెన్నైలో ఒకే కాలేజ్ లో చదువుకున్నారని పోలీసులు అన్నారు.

యువకుడికి నామం పెట్టిన అమ్మా, కూతురు ?
అరవిందన్ దగ్గర మేరీ, ఆమె కూతురు కొన్ని లక్షల రూపాయలు తీసుకున్నారని, తరువాత ఎంతకాలానికి వారు డబ్బులు తిరిగి ఇవ్వలేదని, ఇద్దరి మద్య ఆర్థిక లావాదేవీలు బెడిసికొట్టడంతో అరవిందన్ ఇలా చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూడటంతో స్థానికులు హడలిపోయారు.