వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయిలు 15 ఏళ్ల‌కే పిల్ల‌ల్ని కనగలరు -పెళ్లి వయసు పెంచొద్దు -కాంగ్రెస్ నేత వికృతం - NCPCR ఫైర్

|
Google Oneindia TeluguNews

ప్రత్యర్థి పార్టీ కాబట్టి విధానపరమైన విమర్శల పరంపరలో.. బీజేపీని ఇరుకునపెట్టబోయి తానే అడ్డంగా బుక్కైపోయాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత. దేశంలో స్త్రీల కనీస వివాహ వయసు పెంచేదిశగా కేంద్రంలోని మోదీ సర్కార్ అడుగులు వేస్తుండగా.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఈ అంశంపై చర్చను చేపట్టాయి. అమ్మాయిల పెళ్లి వయసుపై చర్చిద్దామంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇచ్చిన పిలుపును కౌంటర్ చేయబోయిన కాంగ్రెస్ నేత తానే ఎన్ కౌంటరైపోయారిలా..

శోభనం రాత్రే వరుడి ఆత్మహత్య -మేనమామ కూతురుతో ఇటీవలే పెళ్లి -నల్గొండ జిల్లాలో విషాదంశోభనం రాత్రే వరుడి ఆత్మహత్య -మేనమామ కూతురుతో ఇటీవలే పెళ్లి -నల్గొండ జిల్లాలో విషాదం

15ఏళ్లకే ఆ సామర్థ్యం..

15ఏళ్లకే ఆ సామర్థ్యం..

అమ్మాయిల పెళ్లి వ‌య‌సుపై మ‌ధ్య‌ప్ర‌దేశ్ కాంగ్రెస్‌ సీనియర్ నేత‌‌, మాజీ మంత్రి సజ్జన్‌ సింగ్‌ వర్మ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆడపిల్లలు 15 ఏళ్ల వ‌య‌సునుంచే పిల్ల‌ల్ని క‌న‌గ‌లుగుతార‌ని అలాంట‌ప్పుడు వారి వివాహ వయసును 21 ఏళ్లకు పెంచడం ఎందుకని ప్ర‌శ్నించారు. పైగా దీనికి సైంటిఫిక్ ఎవిడెన్సులు కూడా ఉన్నాయని వాదించాడు.. అమ్మాయిలు 15ఏళ్లకే పిల్లల్ని కనగలుగుతారన్న మాట తాను చెబుతున్నది కాదని..

పెళ్లి వయసు పెంచొద్దు..

పెళ్లి వయసు పెంచొద్దు..

వైద్యుల నివేదిక ప్రకారం 15 ఏళ్ల‌ వయస్సు నుంచే బాలికలు పిల్లలను కనడానికి అనుకూలంగా మార‌తార‌ని కాంగ్రెస్ నేత చెప్పారు. 18 ఏళ్ల తర్వాత వారు వివాహం చేసుకోవడానికి తగినంత పరిణతి చెందుతారని అన్నారు. ఈ కార‌ణంగానే ఆడ‌పిల్ల‌ల‌ వివాహ వయసును 18 సంవత్సరాలుగా పేర్కొన్నారని గుర్తు చేస్తూ, అలాంట‌ప్పుడు ఇప్పుడు కొత్త‌గా వారి వివాహ వ‌య‌సును 18 నుంచి 21కి పెంచడమేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

కిడ్నాప్ కేసులో ట్విస్ట్: జగత్‌‌కు ఉచ్చు -మళ్లీ జైలుకు అఖిలప్రియ -ఆమె క్లూతో సోదరుడు బుక్?-పరారీలోనే భర్తకిడ్నాప్ కేసులో ట్విస్ట్: జగత్‌‌కు ఉచ్చు -మళ్లీ జైలుకు అఖిలప్రియ -ఆమె క్లూతో సోదరుడు బుక్?-పరారీలోనే భర్త

 సీఎం డాక్టరా? సైంటిస్టా?

సీఎం డాక్టరా? సైంటిస్టా?

ఆడపిల్లల పెళ్లీడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత సజ్జన్ సింగ్.. అంతటితో ఆగకుండా.. పెళ్లి వయసు పెంచాలని చెప్పడానికి రాష్ట్ర‌ ముఖ్యమంత్రి ఏమైనా వైద్యుడా? శాస్త్రవేత్తా? అని నిల‌దీశారు. ఆడపిల్ల‌లు 18 ఏళ్లు దాటగానే అత్తారింటికి వెళ్లి సంతోషంగా ఉండాలని వ్యాఖ్యానించారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై మ‌హిళా సంఘాలు మండిపడ్డాయి. మరోవైపు..

 కాంగ్రెస్ నేతకు NCPCR నోటీసులు..

కాంగ్రెస్ నేతకు NCPCR నోటీసులు..

బాల్య వివాహాలకు అనుకూలంగా, మహిళాభ్యుదయాన్ని కించపర్చేలా, అమ్మాయిల పెళ్లి వయసుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేన కాంగ్రెస్ నేత సజ్జన్ సింగ్ వర్మాపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నేతను ఆదేశించింది. అమ్మాయిల పెళ్లి వయసు పెంపుపై కేంద్ర సర్కారు నిపుణులతో కమిటీని వేయడం, బడ్జెట్ ప్రసంగంలో, స్వాతంత్య్ర దినోత్సవం నాటి ప్రధాని మోదీ ప్రసంగంలోనూ ఈ అంశం ప్రస్తావనకు రావడం తెలిసిందే.

English summary
The country's apex body for child rights has sought an explanation within two days from former Madhya Pradesh minister Sajjan Singh Verma over his comment that even a 15-year-old girl is capable of reproduction. The Congress leader had made the remark at a press conference in Bhopal on Wednesday while targeting Chief Minister Shivraj Singh Chouhan over his demand for a debate on the parity in the legal age of marriage for both sexes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X