Bengaluru: బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్ అమ్మాయిల ఢిష్యూం ఢిష్యూం, రోడ్లో జట్లు పట్టుకుని ?, వైరల్ !
బెంగళూరు: బెంగళూరులో ఎంతో పేరుప్రతిష్టలు ఉన్న ప్రముఖ గర్ల్స్ స్కూల్ లో శ్రీమంతుల పిల్లలు ఎక్కువగా చదువుతున్నారు. ఆ స్కూల్ లో మా పిల్లలు చదువుకోవడానికి సీటు చిక్కితే చాలు దేవుడా అనుకునే తల్లిదండ్రులు వేల సంఖ్యలో ఉంటారు. క్రమశిక్షణ, శిక్షణకు మారుపేరుగా ఉన్న ఆ గర్ల్స్ స్కూల్ లో చదివిన వేలాది మంది ఇప్పుడు ఉన్నతస్థాయి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. చాలామంది వేర్వేరు రంగాల్లో ఉంటున్నారు. అలాంటి గర్ల్స్ స్కూల్ లో జరిగిన ఓ గొడవ ఇప్పుడు బెంగళూరులో కలకలం రేపింది. గర్ల్స్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు స్కూల్ క్యాంపస్ బయటకు వచ్చి ఒకరి జట్లు ఒకరు పట్టుకుని ముష్టి యుద్దం చేసుకుంటున్న సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ గొడవలో కొందరు అమ్మాయిలకు తీవ్రగాయాలైనాయని తెలిసింది. అమ్మాయిల కుటుంబ సభ్యులు ఆ సమయంలో అక్కడ ఉన్నారని సమాచారం. ఓ విద్యార్థి సాటి విద్యార్థి తల్లిని మెట్ల మీద నుంచి జట్టుపట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లిన సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అమ్మాయిల గొడవకు సంబంధించి స్కూల్ యాజమాన్యం ఎలాంటి ప్రకటన చెయ్యలేదని కన్నడ మీడియా అంటోంది.

బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్
బెంగళూరులో ఎంతో పేరుప్రతిష్టలు ఉన్న ప్రముఖ బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్ లో శ్రీమంతుల పిల్లలు ఎక్కువగా చదువుతున్నారు. బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్ లో మా పిల్లలు చదువుకోవడానికి సీటు చిక్కితే చాలు దేవుడా అనుకునే తల్లిదండ్రులు వేల సంఖ్యలో ఉంటారు. ప్రతి ఏడాది విద్యాసంవత్సరంలో బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్ లో తమ పిల్లలను చదివించాలని అడ్మీషన్ల కోసం తల్లిదండ్రులు పోటీపడుతుంటారు.

శిక్షణ, క్రమశిక్షణకు మారుపేరు ఈ స్కూల్
క్రమశిక్షణ, శిక్షణకు మారుపేరుగా ఉన్న బెంగళూరులోన బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్ లో చదివిన వేలాది విద్యార్థులు మంది ఇప్పుడు దేశ విదేశాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. చాలామంది వేర్వేరు రంగాల్లో ఉంటున్నారు. అంత పేరుప్రతిష్టలు ఉన్న బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్ లో జరిగిన ఓ గొడవ ఇప్పుడు బెంగళూరులో కలకలం రేపింది.

రోడ్డు పక్కన ముష్టి యుద్దం ?
బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్ లో చదువుతున్న కొందరు విద్యార్థులు యూనీఫామ్ లోనే స్కూల్ క్యాంపస్ బయటకు వచ్చి ఒకరి జట్లు ఒకరు పట్టుకుని ముష్టి యుద్దం చేసుకుంటున్న సమయంలో అటువైపు వెలుతున్న కొందరు వారి మొబైల్ ఫోన్లలో తీసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ గొడవలో బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్ లో చదువుతున్న కొందరు అమ్మాయిలకు తీవ్రగాయాలైనాయని తెలిసింది.

రచ్చరచ్చ అయ్యింది ?
కొందరు అమ్మాయిల కుటుంబ సభ్యులు ఆ సమయంలో అక్కడ ఉన్నారని సమాచారం. ఓ విద్యార్థి సాటి విద్యార్థి తల్లిని మెట్ల మీద నుంచి ఆమె జట్టుపట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లిన సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అమ్మాయిల గొడవకు సంబంధించి బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్ యాజమాన్యం ఎలాంటి ప్రకటన చెయ్యలేదని కన్నడ మీడియా అంటోంది. మొత్తం మీద బెంగళూరులో బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్ లోని కొందరు అమ్మాయిలు చేసిన రచ్చ ఇప్పుడు ఐటీ హబ్ లో హాట్ టాపిక్ అయ్యింది.