వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నారులపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించండి: స్వాతిమాలివల్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన నిందితులపై మరణశిక్ష విధించాలని డిల్లీ మహిళా కమిషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఢిల్లీలో చిన్నారులపై చోటు చేసుకొంటున్న అత్యాచారాలపై ఢిల్లీ మహిళా కమిషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసింది.

ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివల్ ఈ మేరకు మోడీకి లేఖ రాశారు. గతవారం ఢిల్లీలో ఎనిమిది నెలల చిన్నారిపై జరిగిన అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలని, అటువంటి విధానాన్ని రూపొందించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

Give death sentence to those raping children: Delhi Commission for Women body writes to PM Narendra Modi

కామాంధుడి అఘాయిత్యానికి తీవ్రంగా గాయపడిన చిన్నారి ఎయిమ్స్‌లో ప్రాణాలతో పోరాడుతోందని, ప్రధాని దృష్టిని అటువైపు మళ్లించాలని ప్రధానికి ఈ లేఖ రాసినట్టు స్వాతి పేర్కొన్నారు.

గత రెండేళ్లుగా ప్రధాని మోదీకి చాలా లేఖలు రాశానని స్వాతి తెలిపారు. వాటిలో ఏ ఒక్కదానికీ సమాధానం లేదని విమర్శించారు. 'ఇది చిన్నపిల్లపై జరుగుతున్న అత్యాచారం కాదు..

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా నెల రోజులపాటు సత్యాగ్రహం చేయనున్నట్టు స్వాతి ఇటీవల ప్రకటించారు. ఈ 30 రోజుల్లో తాను ఇంటికి వెళ్లబోనని, పగలు ఆఫీసులోనే ఉంటానని, రాత్రుళ్లు వివిధ ప్రాంతాలకు వెళ్లి పర్యవేక్షిస్తుంటానని వివరించారు.

English summary
Expressing concern over increasing number of child rapes in Delhi, Delhi Commission for Women (DCW) Chairperson Swati Maliwal wrote to Prime Minister Narendra Modi on Saturday seeking death penalty for those who rape minors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X