వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడ్ న్యూస్: కరోనాకు గ్లెన్‌మార్క్ మాత్ర, డీసీజీఐ ఆమోదం, ఒక్కో మాత్ర రూ.103..

|
Google Oneindia TeluguNews

గుడ్ న్యూస్.. కరోనా వైరస్‌కు గ్లెన్ మార్క్ ఫార్మా కంపెనీ డ్రగ్ కనిపెట్టింది. ఫావిపిరవిర్ అనే టాబ్లెట్ మార్కెట్‌లోకి విడుదల చేసినట్టు శనివారం కంపెనీ ప్రకటించింది. ఫాబి ప్లూ పేరుతో మందులు ఉంటాయని.. పేదలు, మధ్యతరగతి ప్రజలు అందుబాటులో ఉండేలా ధర ఉందని పేర్కొన్నది. ట్యాబ్లెట్‌కు డ్రగ్ కంట్రోల్ర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది.

Recommended Video

COVID-19 : Glenmark Launches Covid-19 Drug, With Low Price!
 షుగర్, హార్ట్ ప్రాబ్లం ఉన్నా..

షుగర్, హార్ట్ ప్రాబ్లం ఉన్నా..

కరోనా వైరస్ తక్కువ లక్షణాలు ఉన్నవారికి మంచి ఔషధంగా పనిచేస్తుందని తెలిపింది. అయితే మెడిసిన్ మాత్రం డాక్టర్ ప్రిస్కిప్షన్ ఉంటేనే ఇస్తామని వెల్లడించింది. 1800 ఎంజీ ఉన్న రెండు మాత్రలు ఫస్ట్ డే వేసుకోవాలని సజెస్ట్ చేసింది. 14 రోజులు 800 ఎంజీ మాత్రలు రోజుకు రెండుసార్లు వేసుకోవాలని తెలిపింది. వైరస్ సోకిన వారు అందరూ మాత్రలు వేసుకోవచ్చు అని వెల్లడించింది. షుగర్, హార్ట్ ప్రాబ్లం ఉన్న వారు కూడా వేసుకోవచ్చు అని తెలిపింది. తమ మాత్ర శరీరంలో ఉన్న వైరస్ నాలుగురోజుల్లోనే శాతాన్ని తగ్గిస్తోందని పేర్కొన్నది.

 మాత్రతో నిర్మూలన

మాత్రతో నిర్మూలన

తమ కంపెనీ డీసీజీఐకి శుక్రవారం దరఖాస్తు చేయగా.. ఇవాళ అనుమతి ఇచ్చిందని తెలిపింది. దేశంలో కరోనా వైరస్‌కు తొలి డ్రగ్ కనిపెట్టింది తమ కంపెనీ అని చైర్మన్, ఎండీ గ్లెన్ సాల్‌దన్హా పేర్కొన్నారు. వైరస్ విజృంభిస్తోన్న సమయంలో డ్రగ్ అందుబాటులోకి వచ్చిందని.. సకాలంలో మాత్రలు తీసుకోవడం వల్ల రోగులకు మేలు చేస్తుందని తెలిపారు.

 88 శాతం రోగం నయం..

88 శాతం రోగం నయం..

మాత్ర వాడటం వల్ల 88 శాతం వైరస్ తగ్గిందని.. క్లినికల్ ట్రయల్స్‌లో తేలిందని పేర్కొన్నారు. దేశంలోని 11 నగరాల నుంచి 150 మందిపై పరీక్షలు చేశామని పేర్కొన్నారు. అందరికీ రెండువారాలు ట్రీట్‌మెంట్ చేశామని పేర్కొన్నారు. దాదాపు వారం రోజుల్లోనే చాలా మంది కోలుకున్నారని తెలిపారు. 34 మాత్రలు గల స్ట్రిప్ రూ.3500 అని.. వచ్చే వారం నుంచి అన్ని మెడికల్ షాపుల్లో లభిస్తోందని తెలిపారు.

English summary
Glenmark Pharmaceuticals on Saturday said it has launched antiviral drug Favipiravir, under the brand name FabiFlu, for the treatment of patients with mild to moderate COVID-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X