వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు ఉద్యోగులపై వరాలు: రూ.15 వేల లోపు జీతం ఉంటే: రూ.200 కోట్ల లోపు గ్లోబల్ టెండర్లు రద్దు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో 200 కోట్ల రూపాయల లోపు గ్లోబల్ టెండర్లను రద్దు చేయబోతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రధానమంత్రి ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ద్వారా దేశీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతం ఇవ్వడానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. దేశీయ ఎంఎస్ఓంఈలకు ఈ-మార్కెట్‌లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రూ.200 కోట్లు విలువ చేసే ప్రభుత్వ పనులకు విదేశీ టెండర్లను అనుమతించడం లేదని, కేవలం దేశఈయ పరిశ్రమలకు మాత్రమే అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఆ అయిదే దేశానికి మూలస్తంభాలు: దేశీయ బ్రాండింగ్: మళ్లీ రూ.500 చెల్లింపు: ఎంఎస్ఎంఈలకు ఊతంఆ అయిదే దేశానికి మూలస్తంభాలు: దేశీయ బ్రాండింగ్: మళ్లీ రూ.500 చెల్లింపు: ఎంఎస్ఎంఈలకు ఊతం

20 కోట్లతో ప్రత్యేక నిధి..

20 కోట్లతో ప్రత్యేక నిధి..

మైక్రో యూనిట్లకు ఇకపై రూ.5 కోట్ల వరకు టర్నోవర్ ఉండేలా వాటి విధి విధానాలను పునఃసమీక్షించినట్లు తెలిపారు. మైక్రో యూనిట్లకు పెట్టుబడుల మొత్తాన్ని కోటి వరకు పెంచబోతున్నామని అన్నారు. దేశీయంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి 10 వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. రుణాలను ఎదుర్కొంటోన్న ఎంఎస్ఎంఈలకు 20 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశామని అన్నారు. దీని ద్వారా ఎలాంటి పూచీకత్తు కూడా లేకుండా ఏడాదిపాటు రుణాల మారటోరియం చేస్తామని అన్నారు.

30 వేల కోట్లతో స్పెషల్ లిక్విడిటీ స్కీమ్..

30 వేల కోట్లతో స్పెషల్ లిక్విడిటీ స్కీమ్..

బ్యాంకింగేతర కంపెనీలు, ఇతర ఆర్థిక కంపెనీల కోసం కూడా ఆర్థిక ప్రోత్సాహకాలను అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మైక్రో కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల కోసం 30 వేల కోట్ల రూపాయల మొత్తంతో స్పెషల్ లిక్విడిటీ స్కీమ్‌ను ప్రకటించినట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని స్టాండ్‌బైగా కేటాయించినట్లు చెప్పారు. మైక్రో కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు పేదలు, మధ్య తరగతి కుటుంబీకుల అవసరాలను తీర్చేలా వాటిని తీర్చిదిద్దుతామని అన్నారు.

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల కోసం

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల కోసం


నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల కోసం లిక్విడిటీ రూపంలో మరో 45 వేల కోట్ల రూపాయలను కేటాయించామని అన్నారు. దీన్ని పాక్షిక క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌గా భావించాల్సి ఉంటుందని అన్నారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలను దీని పరిధిలోకి తీసుకొచ్చామని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు కొత్తగా రుణాలను మంజూరు చేయాలని వాటిని ఆదేశించినట్లు కూడా తెలిపారు.

Recommended Video

Global Tenders To Be Disallowed In Government Procurement Up To 200 Cr
 చిరు ఉద్యోగులపై వరాలు..

చిరు ఉద్యోగులపై వరాలు..

లాక్‌డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోన్న చిరు ఉద్యోగులపై నిర్మలా సీతారామన్ వరాలను ప్రకటించారు. ప్రతి నెలా వారు చెల్లించే ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీ ప్లావిడెంట్ ఫండ్ వాటా మొత్తాన్ని తగ్గించినట్లు తెలిపారు. మూడు నెలల పాటు ఇది అమల్లో ఉంటుందని అన్నారు. చిరు వ్యాపారులు, కార్మికులకు కూడా దీన్ని వర్తింపజేశామని అన్నారు. ప్రతినెలా 15 వేల రూపాయల లోపు వేతనాన్ని తీసుకునే ప్రతి ఒక్కరికీ ఇది వర్తిస్తుందని అన్నారు. దీనికోసం లిక్విడిటీ సపోర్టుగా 6750 కోట్ల రూపాయల మొత్తాన్ని కేటాయించామని నిర్మలా తెలిపారు.

English summary
Finance Minister Nirmala Sitharaman says that Global tenders to be disallowed in Government procurement up to Rs 200 crores. This will make self-reliant India, will also then be able to serve 'Make in India'. Definition of MSMEs has been revised, investment limit to be revised upwards, she added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X