• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కిస్సా కుర్చీకా : గోవా సీఎం క్యాండెట్ పై బీజేపీ మంతనాలు, తెరపైకి ఎంజీపీ నేత సుదీన్ అభ్యర్థితం ?

|

పనాజీ : గోవా సీఎం మనోహర్ పారికర్ మృతితో ముఖ్యంత్రి పీటంపై పీఠముడి నెలకొంది. సీఎం రేసులో మేమున్నామంటు భాగస్వామ్యపక్షాలు బీజేపీకి సూచించడంతో ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం అధిష్టానం తీసుకొనే నిర్ణయానికి శిరసా వహిస్తామని స్పష్టంచేశారు.

దేశం గొప్ప ప్రజాసేవకుడిని కోల్పోయింది: రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ, కేసీఆర్ సహా నేతల స్పందన

రంగంలోకి గడ్కరీ ..

గోవాలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమవడంతో .. భాగస్వామ్య పక్షాలైన మహారాష్ట్రవడి గోమంతిక్ పార్టీ, గోవా ఫార్వార్డ్ పార్టీ కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. సీఎంగా మనోహర్ పారికర్ వ్యవహరించారు. అయితే గత ఏడాది నుంచి ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ .. ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ ఫోకస్ చేసింది. కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీని రంగంలోకి దింపింది. నిన్న రాత్రే గోవా వెళ్లిన ఆయన బీజేపీ ఎమ్మెల్యేలు .. భాగస్వామ్య పార్టీలతో సంప్రదింపులు జరిపారు. ఆయనతోపాటు బీజేపీ కార్యదర్శి బీఎల్ సంతోష్ కూడా మంతనాలు జరిపారు. బీజేపీ ఎమ్మెల్యేలు, భాగస్వామ్య పక్షాలతో విడతలవారీగా చర్చలు జరిపి .. సీఎం అభ్యర్థిని ఖరారు చేసిన మీడియాకు మాత్రం తెలియజేయలేదు.

Goa BJP, allies meet after Manohar Parrikar’s death, no decision on next CM yet

కిస్సా కుర్చీకా ...

గోవా సీఎం పదవీకి తనపేరు పరిశీలించాలని .. ఎంజీపీ నేత సుదీన్ దావలికర్ డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి చాలా సార్లు వెన్నుదన్నుగా నిలిచానని .. ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కొన్నిసార్లు పదవీకోసం త్యాగం కూడా చేశానని గుర్తుచేస్తున్నారు. సుదీన్ ప్రతిపాదనను బీజేపీ తోసిపుచ్చింది. ఆయన డిమాండ్ తప్పని .. ఇందుకు బీజేపీ ఎమ్మెల్యేలు, గోవా ఫార్వార్డ్ పార్టీ కూడా అంగీకరించదని గోవా బీజేపీ నేత మైఖేల్ లోబో తెలిపారు. సమావేశంలో సుదీన్ .. ప్రతిపాదనకు గడ్కరీ, సంతోష్ అంగీకరించలేదని తెలుస్తోంది. బీజేపీ, భాగస్వామ్య పక్షాల అభిప్రాయం తీసుకున్నారు. సీఎం అభ్యర్థిత్వంపై బీజేపీ గోప్యత పాటిస్తోండగా .. ఇంకా నిర్ణయించలేదని, ఏమైనా జరగొచ్చని సుధీన్ ధీమాతో ఉన్నారు.

Goa BJP, allies meet after Manohar Parrikar’s death, no decision on next CM yet

అంతర్మధనం ..

సీఎం అభ్యర్థిత్వం కోసం ఎంజీపీ ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా అని బీజేపీ లోలోన మదనపడుతోంది. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీకి అందజేస్తామని ... బీజేపీ జాతీయ నాయకత్వం ఎంజీపీతో చర్చిస్తోందని ఆ పార్టీ నేతలు తెలిపారు. సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ హైకమాండ్ దే తుది నిర్ణయమని ఎమ్మెల్యేలు స్పష్టంచేస్తున్నారు.

అసెంబ్లీ రద్దు ..?

గోవాలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అస్థిరతకు చెక్ పెట్టేందుకు అసెంబ్లీని రద్దుచేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు గవర్నర్ చేత అసెంబ్లీని రద్దు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ .. అసెంబ్లీ రద్దు ఆలోచన విరమించుకోవాలని గవర్నర్ ను కోరింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Despite extensive discussions that continued late into the night on Sunday, the ruling BJP failed to break the deadlock over who should fill the shoes of Goa chief minister Manohar Parrikar who passed away in the evening. The party’s central leadership dispatched a team comprising Union minister Nitin Gadkari and party’s national joint organisation secretary B L Santosh who held discussions with BJP MLAs as well as leaders of alliance partners — the Maharashtrawadi Gomantak Party (MGP) and the Goa Forward Party — and independents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more