వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే: విచారణ చెయ్యాలి, కోర్టు ఆదేశం, రూ. 50 లక్షలు !

|
Google Oneindia TeluguNews

పణజి: అత్యాచారం కేసులు బీజేపీ నేతలకు వరుసగా చుట్టుకుంటున్నాయి. ఇప్పుడు కొత్తగా అత్యాచారం కేసులో గోవా మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే విచారణ ఎదుర్కోవడానికి సిద్దం అయ్యారు. గోవా బీజేపీ ఎమ్మెల్యే మీద అత్యాచారం ఆరోపణల కేసు విచారణ చెయ్యాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో సంబంధిత పోలీసులు బీజేపీ ఎమ్మెల్యే మీద విచారణ మొదలుపెట్టారు.

అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో వైరల్!అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో వైరల్!

బీజేపీ ఎమ్మెల్యే

బీజేపీ ఎమ్మెల్యే

గోవా మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే అటాన్సియో మోన్సరాటే 2016 మైనర్ మీద అత్యాచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే తాను మైనర్ మీద అత్యాచారం చెయ్యలేదని, తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ఎమ్మెల్యే అటాన్సియో మోన్సరాటే అన్నారు.

 కోర్టు ఆదేశం

కోర్టు ఆదేశం

ఈ అత్యాచారం కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలని బీజేపీ ఎమ్మెల్యే అటాన్సియో మోన్సరాటే కోర్టుకు మనవి చేశారు. కేసు విచారణ చేసిన సెషన్స్ న్యాయస్థానం బీజేపీ ఎమ్మెల్యే అటాన్సియో మోన్సరాటే మీద అత్యాచారం చేశారని ఆరోపణలు వచ్చాయని, విచారణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఎమ్మెల్యేకి ఫ్రెండ్ సహాయం

ఎమ్మెల్యేకి ఫ్రెండ్ సహాయం

కోర్టు ఆదేశాలతో అక్టోబర్ 17వ తేదీ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అటాన్సియో మోన్సరాటే మీద విచారణ జరగనుంది. 2016లో తన మీద ఎమ్మెల్యే అటాన్సియో మోన్సరాటే, ఆయన స్నేహితురాలు రోసి ఫెర్రో సహాయంతో లైంగిక దాడికి గురి చేశారని భాదితురాలు ఆరోపిస్తున్నది.

రూ. 50 లక్షలకు అమ్మేశారు

రూ. 50 లక్షలకు అమ్మేశారు

కొందరి దగ్గర తనను రూ. 50 లక్షలకు తనను కొనుగోలు చేశారని, తరువాత నిర్బంధించి అత్యాచారం చేశారని, చిత్రహింసలు పెట్టారని భాదితురాలు ఇంతకు ముందు కోర్టుకు సమాచారం ఇచ్చింది. అయితే భాదితురాలు పొంతనలేని వివరాలు ఇస్తున్నదని, ఆమె మాటల్లో నిజం లేదని ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

కాంగ్రెస్ టూ బీజేపీ

కాంగ్రెస్ టూ బీజేపీ

అప్పట్లో ఎమ్మెల్యే అటాన్సియో మోన్సరాటే, రోసి ఫెర్రో బెయిల్ మీద బయటకు వచ్చారు. 2018 శాసన సభ ఎన్నికల్లో అటాన్సాయో మోన్సరాటే కాంగ్రెస్ టిక్కెట్ మీద పోటీ చేశారు. తరువాత ఆయన మీద కేసు పెట్టిన భాదితురాలు మాయం అయ్యారు. ఆ సమయంలో ఎమ్మెల్యే అత్యాచారం ఆరోపణలు గోవాలో దూమరం లేపాయి. ఉప ఎన్నికల తరువాత ఇప్పుడు మళ్లీ భాదితురాలు తెరమీదకు వచ్చారు.

English summary
Goa BJP MLA, former minister Atanasio Monserrate will face trail in rape case. Rape case lodged against him in 2016 accusing that he raped and sexually harassed a minor girl.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X