వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాకు గోవా సీఎం సిద్దం: నో చెప్పిన బీజేపీ హైకాండ్, బాంబు పేల్చిన మంత్రి, వారసుడు ఎవరు?

|
Google Oneindia TeluguNews

పణజి: అనారోగ్యంతో భాదపతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ రాజీనామా చెయ్యడానికి సిద్దంగా ఉన్నారని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, గోవా ఫార్వడ్ పార్టీ చీఫ్ విజయ్ సర్ దేశాయ్ అన్నారు. అయితే ఢిల్లీలోని హైకమాండ్ మనోహర్ పారిక్కర్ రాజీనామా చెయ్యడానికి అనుమతి ఇవ్వడం లేదని గోవా మంత్రి విజయ్ సర్ దేశాయ్ బాంబు పేల్చారు. విజయ్ సర్ దేశాయ్ వ్యాఖ్యలతో ఇప్పడు తీవ్రస్థాయిలో చర్చ మొదలైయ్యింది. మనోహర్ పారిక్కర్ సీఎం పదవికి రాజీనామా చెయ్యాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

రాజీనామాపై వివాదం

రాజీనామాపై వివాదం

తీవ్రస్థాయిలో అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న గోవా ముఖ్యంత్రి మనోహర్ పారిక్కర్ రాజీనామ విషయంలో ఇప్పటికే వివాదం మొదలైయ్యింది. మనోహర్ పారికర్ 48 గంటల్లో రాజీనామా చెయ్యాలని డెడ్ లైన్ విధిస్తూ గోవాలోని స్వచ్చంద సంస్థలు, ఆర్ టీఐ కార్యకర్తలు ఆయన ఇంటి ముందు ధర్నా నిర్వహించారు.

హైకమండ్ ఆలోచన !

హైకమండ్ ఆలోచన !


వినాయక చవితి పండుగ సమయంలో గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. సీఎంగా భాద్యతల నిర్వహించడం తనకు కష్టంగా ఉందని మనోహర్ పారిక్కర్ బీజేపీ అధిష్టానికి చెప్పారని సమాచారం.
అయితే బీజేపీ అధిష్టానం ఈ విషయంలో ఆచితూచి అడుగువేస్తోంది.

హైకమాండ్ గ్రీన్ సిగ్నల్

హైకమాండ్ గ్రీన్ సిగ్నల్

గోవా సీఎం మనోహర్ పారిక్కర్ దగ్గర ఉన్న అనేక ఖాతాలను ఆ రాష్ట్రంలోని సీనియర్ మంత్రులకు అప్పగించడానికి బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోవా సీఎం మనోహర్ పారిక్కర్ దగ్గర ఉన్న శాఖలను పలువురు సీనియర్ మంత్రులకు అప్పగించారు.

మంత్రి మనసులో ఏం ఉంది ?

మంత్రి మనసులో ఏం ఉంది ?

ముఖ్యంత్రి మనోహర్ పారిక్కర్ అనారోగ్యంతో భాదపడుతున్నారని, ఈ సమయంలో ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం మీద పరిణామాలు పడుతున్నాయని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ సర్ దేశాయ్ అంటున్నారు. ఈ విషయంపై బీజేపీ హైకమాండ్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మంత్రి విజయ్ సర్ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం వారసుడు ఎవరు ?

సీఎం వారసుడు ఎవరు ?

గోవాలో ముఖ్యమంత్రిగా సమర్థవంతమై నాయకుడిగా మనోర్ పారిక్కర్ ప్రజల దగ్గర మంచి గుర్తింపు పొందారు. వీలైనంత వరకు మనోహర్ పారిక్కర్ ను సీఎంగా కొనసాగించాలని బీజేపీ హైకమాండ్ భావించింది. మనోహర్ పారిక్కర్ కు దీటైన వారుసుడిని సీఎంగా నియమించాలని బీజేపీ హైకమాండ్ నానాతంటాలు పడుతోంది. సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న గోవా ఫార్వడ్ పార్టీ చీఫ్ విజయ్ సర్ దేశాయ్ వ్యాఖ్యలతో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేసింది.

English summary
Manohar Parrikar wants to resign, but Bjp highcommand will not let, says Goa Forward Party chief and Agriculture Minister Vijai Sardesai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X