వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవా రాకండి.. వస్తే ఆ నిబంధనలు పాటించండి.!లేకపోతే బాగా బీచ్ లో బాదేస్తామంటున్న సీఎం..!

|
Google Oneindia TeluguNews

పాంజిమ్/హైదరాబాద్ : దేశంలోనే పర్యాటక నగరమైన గోవా రాష్ట్రం కరోనా విష కోరల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. విదేశీ పర్యాటకులతో పాటు దేశంలో అనేక మంది గోవా వెళ్లి కాస్త రిలాక్స్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి గోవా పట్టణం ఇప్పుడు ఆంక్షల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. మొన్నటి వరకూ కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా ముద్ర వేసుకున్న గోవాలో ఉన్నట్టుంది కరోనా పాజిటీవ్ కేసుల నమోదు గోవా ప్రభుత్వాన్ని కలవారానికి గురి చేస్తున్నాయి.

గోవా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ కఠిన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలో ప్రవేశించే వారి కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఇక గోవాలోని కరోనా పేషెంట్లలో 90 శాతం మంది మహారాష్ట్ర నుంచి వచ్చిన వారేనని నిర్ధారిస్తోంది గోవా ప్రభుత్వం. ఇకపై అక్కడి నుంచి వచ్చే వారికి కోసం ప్రత్యేక నిబంధనలు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నామని స్పష్టం చేశారు సీఎం ప్రమోద్‌ సావంత్.

Goa CM Pramod sawant may implement tough rules..

ఇదిలా ఉండగా రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో గత శనివారం ముంబై నుంచి గోవాకు వచ్చిన 11 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 67కు ఎగబాకింది. ఇక సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్నప్పటికీ గోవా ప్రాణాంతక వైరస్‌ను కట్టడి చేయడంలో విజయం సాధించింది. అయితే లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన నాటి నుంచి అక్కడ రోజురోజుకీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కరంగా మారినట్టు తెలుస్తోంది.

దీంతో గోవా మీదుగా వెళ్తున్న పలు రైళ్లను రాష్ట్రంలో ఆపకూడదని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ నిర్ణయించారు. రైళ్లు, రోడ్డు, ఇతర మార్గాల ద్వారా రాష్ట్రంలో ప్రయాణిస్తున్న వారి వల్ల కూడా కేసులు పెరుగుతున్నాయని, ఇకపై నిబంధనలు మరింత కఠినతరం యాల్సిన అవసరముందన్నారు గోవా ఆరోగ్య శాఖా మంత్రి విశ్వజిత్‌ రాణే. ఆంక్షలు పటించని వారు గోవాకు రావాల్సిన అవసరం లేదని కూడా గోవా ప్రభుత్వం తేల్చి చెప్తోంది.

English summary
Goa Chief Minister Pramod Sawant has taken a tough decision as corona cases are on the rise in Goa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X