వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Goa elections: స్వతంత్ర అభ్యర్థిగా ఉత్పల్ పారికర్; పనాజీ బరిలో బీజేపీకి తలనొప్పిగా ఉత్పల్

|
Google Oneindia TeluguNews

గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ బుధవారం పనాజీ అసెంబ్లీ నుండి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తానని చెప్పారు. గురువారం నాడు ఉత్పల్ పారికర్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పనాజీ నుండి నామినేషన్ దాఖలు చేయనున్నారు

పనాజీ నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఉత్పల్ పారికర్

పనాజీ నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఉత్పల్ పారికర్

పనాజీ నియోజకవర్గంలో బీజేపీకి వ్యతిరేకంగా మాజీ సీఎం మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ పోటీ చేయకుండా ఉండేందుకు బీజేపీ ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేసింది . ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. పనాజీ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి రంగంలోకి దిగడంతో, పనాజీ నియోజకవర్గంలో బీజేపీకి పెద్ద తలనొప్పి ఎదురైంది. పారికర్ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం పనాజీ నియోజకవర్గంలో బీజేపీ అవకాశాలను దెబ్బతీయడమే కాకుండా, ఫిబ్రవరి 14న జరిగే ఎన్నికల్లో గోవాలోని అనేక ఇతర నియోజకవర్గాల్లో పార్టీ పనితీరును దెబ్బతీయవచ్చునని భావిస్తున్నారు.

పనాజీ సీటు కోసం బిజెపి మరియు ఉత్పల్ మధ్య పోటీ

పనాజీ సీటు కోసం బిజెపి మరియు ఉత్పల్ మధ్య పోటీ

ఆప్ , తృణమూల్ కాంగ్రెస్ మరియు కాంగ్రెస్‌లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉత్తర గోవాలో మెజారిటీ సీట్లను గెలుచుకోవడానికి, బిజెపి ఎక్కువగా సిట్టింగ్ పనాజీ ఎమ్మెల్యే అటానాసియో మోన్సెరేట్‌పై ఆధారపడి ఉంది. అందుకే అదే స్థానం నుండి ఉత్పల్‌కు బదులుగా అతనిని పోటీకి దింపాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఉత్తర గోవాలో పెద్ద సంఖ్యలో దివంగత పారికర్ మద్దతుదారుల నుండి ఉత్పల్‌కు పెరుగుతున్న మద్దతు మరియు బలహీనమైన అభ్యర్థి ఎల్విస్ గోమ్స్‌ను కాంగ్రెస్ రంగంలోకి దింపడం వల్ల పనాజీ సీటు కోసం బిజెపి మరియు ఉత్పల్ మధ్య పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తుంది.

పనాజీ నుండి మాన్‌సెరేట్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన ఉత్పల్ పారికర్

పనాజీ నుండి మాన్‌సెరేట్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన ఉత్పల్ పారికర్

పనాజీ నుంచి కాకుండా బిజెపి ఉత్పల్‌ పారికర్ కు మరో రెండు స్థానాలను ఆఫర్ చేసింది. అయినప్పటికీ ఉత్పల్ పారికర్ వాటిని తిరస్కరించారు . 1994 నుండి అతని దివంగత తండ్రి ఆధీనంలో ఉన్న నియోజకవర్గం అయిన పనాజీ నుండి కళంకిత మాన్‌సెరేట్‌ను పోటీ చేయాలన్న పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అతను తిరస్కరించినట్లు తెలుస్తుంది. "పార్టీ మాత్రమే లాభపడవచ్చు. పనాజీలో ఉత్పల్‌ను అక్కడ నుంచి పోటీకి దింపితే బిజెపి కలిగే లాభం కన్నా, మాన్‌సెరేట్‌ కు పనాజీతో పాటు పలు ఇతర స్థానాల్లో పార్టీని గెలిపించడంలో సత్తా ఉందన్న నమ్మకంతోనే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది.

పనాజీతో పాటు పలు నియోజకవర్గాలపై పారికర్ ప్రభావం

పనాజీతో పాటు పలు నియోజకవర్గాలపై పారికర్ ప్రభావం

అయితే మనోహర్ పారికర్ కుటుంబాన్ని బీజేపీ పట్టించుకోకపోవడం పనాజీతో పాటు పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. మాన్‌సెరేట్‌కి మద్దతుగా అతని జనాదరణపై అత్యధిక సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో బిజెపి ఉన్నట్టు వర్గాలు పేర్కొన్నాయి. టిఎంసి, శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు ఆయనకు మద్దతుగా నిలిచే అవకాశం ఉన్నందున పనాజీలో ఉత్పల్ పారికర్, బిజెపి మధ్య పోటీ ఉంటే ఎవరు గెలుస్తారో ఊహించడం కష్టమని రాజకీయ విశ్లేషకుడు కిషోర్ నాయక్ గాంకర్ అంటున్నారు.

ఉత్పల్ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మారనున్న రాజకీయ సమీకరణాలు

ఉత్పల్ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మారనున్న రాజకీయ సమీకరణాలు

పనాజీ స్థానానికి బిజెపిని ఓడించే ప్రయత్నంలో అందరూ ఎవరికి మద్దతు ఇస్తారనేది ఉత్పల్ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మాత్రమే స్పష్టమవుతుందని తెలుస్తుంది. బిజెపి మినహా ఇతర పార్టీలు బరిలోకి దింపుతున్న అభ్యర్థులెవరూ మాన్‌సెరేట్‌ను ఓడించగల సామర్థ్యం కలిగి లేరని ఆయన అన్నారు. తనకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులలో కూడా, పనాజీ నియోజకవర్గంలో ప్రజలు తనకు మద్దతు ఇస్తారనే నమ్మకం ఉందని మాన్‌సెరేట్‌ చెప్పారు.

Recommended Video

Assembly Elections 2022: Rallies, Road Show లకు EC నో.. | Oneindia Telugu
తనకు ప్రత్యర్థుల విషయంలో ఆందోళన లేదన్న మాన్‌సెరేట్‌ .. బీజేపీలో ఆందోళన

తనకు ప్రత్యర్థుల విషయంలో ఆందోళన లేదన్న మాన్‌సెరేట్‌ .. బీజేపీలో ఆందోళన

బుధవారం బోకా డా వాకాలో తన ప్రచారంలో, మాన్‌సెరేట్‌ తన ప్రత్యర్థుల గురించి ఆందోళన చెందడం లేదని, తనపై ఎవరు పోటీ చేశారనేది తనకు పట్టింపు లేదని అన్నారు. పనాజీ ప్రజలకు సేవ చేస్తూనే తన స్థానాన్ని నిలుపుకుంటానని చెప్పారు.గోవా అభివృద్ధి కోసం గత రెండు దశాబ్దాలుగా తాను చేస్తున్న కృషిని గుర్తు చేసుకుంటూ, ప్రజల సంక్షేమం కోసం తాను కట్టుబడి ఉన్నానని, ఈసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇక గురువారం నాడు ఉత్పల్‌ పారికర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పనాజీ లో వార్ ఉత్పల్ వర్సెస్ బీజేపీ అన్నట్టు సాగనుంది.

English summary
Utpal Parrikar will file his nomination on Thursday as an independent candidate. No matter how much the BJP tried to stop Utpal, it was to no avail. With this, the war between BJP and Utpal will continue in Panaji.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X