వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంజాయి సాగుకు బీజేపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ -అవును, గోవాలోనే -డ్రగ్స్ కట్టడికి విఘాతమంటూ..

|
Google Oneindia TeluguNews

ఇండియాలో ఎంజాయ్‌మెంట్‌కు కేరాఫ్‌గా ఉన్న గోవాకు ప్రపంచ దేశాల నుంచి సైతం నిత్యం లక్షల్లో టూరిస్టులు వస్తుంటారు. ప్రస్తుతం కరోనా విలయం వల్ల సంఖ్య కాస్త తగ్గిందనుకోండి. మందు, విందు, పొందుకు స్వర్గంగా ఉండే గోవాలో డ్రగ్స్ మహమ్మారి ప్రభావం కూడా ఎక్కువే. సర్కారు ఎంత కట్టడి చేసినా మాదకద్రవ్యాల్ని అరికట్టడం సవాలుగా మారింది. ఇదిలా ఉంటే..

తిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్‌లో గంటకు రూ.3వేలంటూతిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్‌లో గంటకు రూ.3వేలంటూ

గోవా రాష్ట్రాన్ని పాలిస్తోన్న బీజేపీ సర్కారు.. స్థానికంగా గంజాయి సాగుచేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇది మాదకద్రవ్యంగా మాత్రం వాడరాదని కఠిన షరతులు విధించింది. ఔషధ ప్రయోజనాల కోసం పరిమితస్థాయిలో మారిజువానా(గంజాయి)సాగుచేసేందుకు అనుమతించాలని ఆరోగ్యశాఖ చేసిన ప్రతిపాదనకు గోవా న్యాయశాఖ బుధవారం అనుమతులిచ్చింది.

Goa govts law department gives nod for ganja cultivation

న్యాయబద్ధమైన అంశాలను పరిశీలించి అనుమతులు మంజూరు చేసినట్లు న్యాయ శాఖ మంత్రి నిలేష్ కాబ్రాల్ మీడియాకు తెలిపారు. దీంతో గోవాలో గంజాయి సాగుకు చట్టబద్ధత లభించినట్లయింది. 1985లో నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్(NDPS)కింద గంజాయి మొక్క నిషేధిత జాబితాలో చేరిందని, సవరణ ఉత్తర్వులతో ఇప్పుడు వాటి సాగుకు అనుమతిచ్చామని, దీంతో ఫార్మాకంపెనీలకు ఈ సాధారణ డ్రగ్ గా గంజాయిని అమ్మే వీలు ఏర్పడిందని మంత్రి చెప్పారు. కాగా,

రామతీర్థం విధ్వంసం: మరో సంచలనం -జగన్‌పై మోదీకి వైసీపీ ఎంపీ ఫిర్యాదు -కేంద్ర బృందాలురామతీర్థం విధ్వంసం: మరో సంచలనం -జగన్‌పై మోదీకి వైసీపీ ఎంపీ ఫిర్యాదు -కేంద్ర బృందాలు

గంజాయి సాగు విషయంలో గోవా ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ చర్యతో బీజేపీ ఇంకాస్త పతనం అయిందని, సర్కారు చర్యలు చట్టవిరుద్దంగా ఉన్నాయని, డ్రగ్స్ వాడకంపై గోవా ఫైట్ చేస్తున్న ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం..రాష్ట్ర సామాజిక వ్యవస్థలోకి డ్రగ్ మరింతగా వచ్చేందుకు దోహదపడుతుందని గోవా కాంగ్రెస్ ప్రతినిధి అమర్నాథ్ పంజికర్ అన్నారు. ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పంజికర్ డిమాండ్ చేశారు. గోవా కంటే ముందు ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వాలు కూడా గంజాయి సాగుకు అనుమతిచ్చే దిశగా చర్యలు చేపట్టాయి.

English summary
The law department of the Goa government has given approval to a proposal to allow cultivation of marijuana for medicinal purposes, a minister has said, a move which drew flak from opposition parties. Law Minister Nilesh Cabral told reporters on Tuesday evening that his department has vetted and cleared the proposal to allow cultivation of marijuana (ganja or grass) for medicinal purposes in the tourist state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X