వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవా కుర్చీపై కొత్త సీఎం ధీమా.. అటు కాంగ్రెస్ మార్క్.. రిసార్టుకు చేరిన రాజకీయం

|
Google Oneindia TeluguNews

పనాజీ : గోవా ముఖ్యమంత్రి హోదాలో మనోహర్ పారికర్ చనిపోవడంతో తదనంతర పరిణామాలు అక్కడి వాతావరణాన్ని హీటెక్కిస్తున్నాయి. పారికర్ వారసుడిగా ప్రమోద్ సావంత్ కొత్త సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే బుధవారం నాడు అసెంబ్లీలో బల పరీక్ష ఎదుర్కోబోతున్నారు. కమలం పువ్వు లెక్కల ప్రకారం నో టెన్షన్ అంటున్నారు ప్రమోద్ సావంత్. బల పరీక్షలో నెగ్గి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనకు సంపూర్ణ మద్దతు ఉందని ప్రకటించారు. తమ సభ్యులను రిసార్టులకు తరలించినట్లు సమాచారం.

ఎన్నికల్లో పోటీచేయాలంటే పైసలుండాలా? బరిలోకి సిలిండర్ సప్లయర్ఎన్నికల్లో పోటీచేయాలంటే పైసలుండాలా? బరిలోకి సిలిండర్ సప్లయర్

 బలం తక్కువే.. కానీ మెజార్టీ..!

బలం తక్కువే.. కానీ మెజార్టీ..!

40 స్థానాలకు గాను గోవా అసెంబ్లీలో ప్రస్తుతం 36 మంది సభ్యులున్నారు. అందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు 14 మంది, ఎన్సీపీకి చెందిన సభ్యుడు ఒకరుండగా.. బీజేపీకి చెందినవారు 12 మంది మాత్రమే ఉన్నారు. అయితే గోవా ఫార్వర్డ్ పార్టీతో పాటు మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీకి చెరో ముగ్గురు చొప్పున సభ్యులున్నారు. వీరితో పాటు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీకి మద్దతివ్వడంతో కమలం బలం 21 కి చేరింది.

 కమలనాథుల్లో ఆత్మవిశ్వాసం

కమలనాథుల్లో ఆత్మవిశ్వాసం

బల నిరూపణపై ప్రమోద్ సావంత్ ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ సభ్యులు కదుపుతున్న పావులతో కమలనాథుల్లో ఒకింత ఆందోళన కనిపిస్తోంది. గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థులతో గట్టెక్కుతానని ప్రమోద్ సావంత్ భావిస్తున్నప్పటికీ.. మారుతున్న రాజకీయ పరిణామాలు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. బీజేపీకి కేవలం 12 మంది సభ్యులు మాత్రమే ఉన్నప్పటికీ.. మిత్రపక్షాల మద్దతు కలిసొచ్చే అంశం.

 కాంగ్రెస్ కన్ను.. బీజేపీ అలర్ట్

కాంగ్రెస్ కన్ను.. బీజేపీ అలర్ట్

మిత్రపక్షాల అండతో గోవా సీఎం కుర్చీ పీఠం దక్కించుకునేందుకు ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు తెరవెనుక రాజకీయం నడిపారు. ఎలా చూసినా బీజేపీకి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. బల నిరూపణలో బీజేపీ నెగ్గి అధికార పీఠం కైవసం చేసుకునే ఛాన్సుంది. అదే క్రమంలో అటు కాంగ్రెస్ కూడా అందివచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకునేలా వ్యూహాలు రచిస్తోంది. కానీ వారి ఆటలు సాగకుండా బీజేపీకి మద్దతిస్తున్న గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీలకు చెందిన
విజయ్‌ సర్దేశాయ్, సుదీన్‌ ధవలికర్‌కు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చేశారు కమలనాథులు.

 గో.. గోవా, రిసార్టుకు చేరిన రాజకీయం

గో.. గోవా, రిసార్టుకు చేరిన రాజకీయం

బలనిరూపణ తంతులో భాగంగా బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. తమ సభ్యులెవరు చేజారిపోకుండా రిసార్టు రాజకీయానికి తెరలేపింది. బీజేపీకి చెందిన 12 మంది సభ్యులతో పాటు మిత్రపక్షాలకు చెందిన ఆరుగురు సభ్యులు, స్వతంత్ర సభ్యులు మరో ముగ్గురిని రిసార్టులకు, లగ్జరీ హోటళ్లకు తరలించినట్లు తెలుస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీకి 14 మంది సభ్యులున్నారు. వారు కూడా చిన్న పార్టీల సభ్యుల వైపు కన్నేయడంతో బీజేపీ నేతలు ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

English summary
After Manohar Parikkar dies in Goa's Chief Minister's post, subsequent developments are hitting the atmosphere. Pramod Sawant became the new Chief Minister after Parrikar. However, on Wednesday the Assembly is going to face a floor test. He announced that he had full support. Information about their members moved to resorts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X