వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిల్డప్ బాబాయికే బాబు వీడు.. రాష్ట్ర మంత్రినంటూ అందర్నీ బురిడీ కొట్టించాడు.. చివరికి..

|
Google Oneindia TeluguNews

కోతల రాయుడికి తాత లాంటివాడు బిల్డప్ బాబాయి అనుకుంటే.. ఆ బాబాయినే మించిన బడుద్ధాయి వీడు. మామూలుగా మోసం కేసుల్ని మనం చాలా చూసుంటాం. పోలీసులమనో, సీబీఐ, సీఐడీ లేదా ఐటీ అధికారులమనో చెప్పుకుంటూ అవతలివాళ్లని బురిడే కొట్టించే బాపతుగాళ్ల గురించి వార్తల్లో చదువుతుంటాం. వీడు మాత్రం ఏకంగా తాను మంత్రినని చెప్పుకుని దర్జాలు అనుభవించాడు.

అనుభవించురాజా..

అనుభవించురాజా..


ఉత్తరప్రదేశ్ కు చెందిన సునీల్ సింగ్.. తాను ఉత్తరప్రదేశ్‌ మంత్రినంటూ ఫేక్ డాక్యుమెంట్లతో గోవా ప్రభుత్వాన్ని బురిడీకొట్టించాడు. వీడిచ్చిన బిల్డప్పును నమ్మిన గోవా అధికారులు.. పనాజీలోని గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో బస ఏర్పాటుచేసింది. 12 రోజులపాటు రాజభోగాలు అనుభవించిన తర్వాతగానీ అసలు బండారం బయటపడలేదు.

సీఎంకు అనుమానం రావడంతో..

సీఎంకు అనుమానం రావడంతో..

యూపీ రాష్ట్రమంత్రి హోదాలో గోవా సీఎంతో మంతనాలు జరుపుతానంటూ సునీల్ సింగ్ సీఎంవోకు ఒక లేఖ రాశాడు. ఆ లెటర్ ను పరిశీలించిన గోవా సీఎం ప్రమోద్ సావంత్ కు ఎక్కడో అనుమానమొచ్చింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని పురమాయించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది.

అంతకు ముందే ఓ మంత్రితో భేటీ

అంతకు ముందే ఓ మంత్రితో భేటీ

పోలీసులకు పట్టుపడటానికి మూడ్రోజుల ముందు ఈ నకిలీ మంత్రి.. గోవా రాష్ట్రమంత్రితో భేటీ అయి పలు అభివృద్ధి కార్యక్రమాలపై లోతైన చర్చలు జరిపాడట. దీనిపై గోవా మంత్రిని వివరణ కోరగా.. ‘‘నాకెలా తెలుస్తుంది బాబూ వాడు నకిలీనో కాదో అని? అధికారులు చెప్పారు.. ఆ మేరకు మాట్లాడాను. అదీ కూడా పది నిమిషాల్లోనే మీటింగ్ ముగిసింది''అని వాపోయారు. అయినా.. నకిలీ మంత్రిగా బిల్డప్ ఇవ్వడమే నేరం.. పైగా సీఎంతో స్పెషల్ మీటింగులేంటి? మరీ మితిమీరిన బిల్డప్ కాకపోతే!!

English summary
Goa Police have arrested a man for allegedly posing as a minister from Uttar Pradesh by submitting fake documents and staying at a state guest house in Panaji for over 10 days
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X