వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెహెల్కా కేసు: ఇంటికి పోలీసులు, తేజ్‌పాల్ టోకరా

By Pratap
|
Google Oneindia TeluguNews

Tarun Tejpal
న్యూఢిల్లీ: మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి కేసును ఎదుర్కుంటున్న తెహెల్కా వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తే‌జ్‌పాల్ గోవా పోలీసులకు టోకరా ఇచ్చినట్లు తెలుస్తోంది. గోవా పోలీసులు శుక్రవారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలోని తరుణ్ తేజ్‌పాల్ ఇంటికి చేరుకున్నారని, అయితే తేజ్‌పాల్ ఇంట్లో లేడని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

తరుణ్ తేజ్‌పాల్ ఉంటాడని భావిస్తున్న ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేసే అవకాశాలున్నాయి. అతను ఎక్కడ ఉన్నాడనే విషయం చెప్పడానికి తరుణ్ తేజ్‌పాల్ నిరాకరించారు. మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి కేసులో గోవా పోలీసులు ప్రశ్నించడానికి అతనికి సమన్లు జారీ చేశారు. అయితే, అతను గడువులోగా పోలీసుల ముందు హాజరు కాలేదు.

గురువారం సాయంత్రం 3 గంటల్లోగా అతను పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది. దాంతో పోలీసులు మెజిస్ట్రేట్ నుంచి నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్‌ను పొందారు. తాను మర్నాడు గోవా వస్తానని, తాను విచారణకు సహకరిస్తానని తరుణ్ తేజ్‌పాల్ గురువారంనాడు సమాచారం అందించాడు.

తనకు శనివారం వరకు గడువు ఇవ్వాలని తరుణ్ తేజ్‌పాల్ అంతకు ముందు గోవా పోలీసులను కోరాడు. అయితే, వారు అందుకు నిరాకరించారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

English summary
A team of Goa Police reached the residence of Tehelka editor Tarun Tejpal in the national capital on Friday morning
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X