వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెహెల్కా కేసు: ఇంటికి పోలీసులు, తేజ్‌పాల్ టోకరా

తరుణ్ తేజ్‌పాల్ ఉంటాడని భావిస్తున్న ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేసే అవకాశాలున్నాయి. అతను ఎక్కడ ఉన్నాడనే విషయం చెప్పడానికి తరుణ్ తేజ్‌పాల్ నిరాకరించారు. మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి కేసులో గోవా పోలీసులు ప్రశ్నించడానికి అతనికి సమన్లు జారీ చేశారు. అయితే, అతను గడువులోగా పోలీసుల ముందు హాజరు కాలేదు.
గురువారం సాయంత్రం 3 గంటల్లోగా అతను పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది. దాంతో పోలీసులు మెజిస్ట్రేట్ నుంచి నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్‌ను పొందారు. తాను మర్నాడు గోవా వస్తానని, తాను విచారణకు సహకరిస్తానని తరుణ్ తేజ్‌పాల్ గురువారంనాడు సమాచారం అందించాడు.
తనకు శనివారం వరకు గడువు ఇవ్వాలని తరుణ్ తేజ్‌పాల్ అంతకు ముందు గోవా పోలీసులను కోరాడు. అయితే, వారు అందుకు నిరాకరించారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.